బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా సిల్హెట్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫార్చూన్ బారిషల్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బారిషల్.. కైల్ మేయర్స్ (31 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహాం (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బారిషల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 19, అహ్మద్ షెహజాద్ 17, సౌమ్య సర్కార్ 8, మహ్మదుల్లా 12 నాటౌట్, మెహిది హసన్ మీరజ్ 15 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో తంజిమ్ షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. షఫీకుల్ ఇస్లాం, హ్యారీ టెక్టార్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్.. బెన్నీ హోవెల్ (53), ఆరీఫుల్ హక్ (57) అర్దసెంచరీలతో రాణించినప్పటికీ లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్ (0), జకీర్ హసన్ (5), నజ్ముల్ షాంటో (0), ర్యాన్ బర్ల్ (3) దారుణంగా విఫలం కాగా.. ఏంజెలో పెరీరా (17), మొహమ్మద్ మిథున్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బారిషల్ బౌలర్లలో కైల్ మేయర్స్ (4-1-12-3) అద్భుత గణాంకాలతో అదరగొట్టగా.. సైఫుద్దీన్, మెక్‌కాయ్, కేశవ్ మహారాజ్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు.
మరో మ్యాచ్‌లో దురంతో ఢాకాపై చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఢాకా టీమ్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తంజిత్ హసన్ (70), షువగటా హోమ్ (3-0-12-2) ఛాలెంజర్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment