
క్రికెట్‌లో రనౌట్‌లు జరగడం సహజం. అందులో కొన్ని విచిత్ర రనౌట్‌లు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రనౌట్ మాత్రం అంతకుమించినది. అసలు ఎవరు ఊహించని రీతిలో ఆండ్రీ రసెల్ రనౌటవ్వడం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇది చోటుచేసుకుంది. ఢాకా ప్లాటూన్, కుల్నా టైగర్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది.
చదవండి: BBL 2021-22: స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది
ఆండ్రీ రసెల్, మహ్మదుల్లా నిలకడైన బ్యాటింగ్‌తో ఢాకా ప్లాటూన్ ఇన్నింగ్స్ సజావుగా సాగుతుంది. ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం కూడా ఏర్పడింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఐదో బంతిని రసెల్ భారీ సిక్స్ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఉంచుకోవాలని భావించి థర్డ్‌మన్ దిశగా ఆడాడు. మెహదీ హసన్ బంతిని అందుకొని స్ట్రైకింగ్ వైపు విసిరాడు. బంతి వికెట్లకు తాకినప్పటికి.. అప్పటికే మహ్మదుల్లా క్రీజులోకి చేరుకున్నాడు. అవతలి వైపు రసెల్ కూడా ఇక భయం లేదనుకొని కాస్త స్లో అయ్యాడు.
ఇక్కడే రసెల్‌ను దురదృష్టం వెంటాడింది. మెహదీ హసన్ వేసిన త్రో స్ట్రైకింగ్ ఎండ్ వద్ద ఉన్న వికెట్లను తాకి.. మళ్లీ అక్కడినుంచి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్లింది. రసెల్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. బిగ్‌స్క్రీన్‌పై రసెల్ క్లియర్ రనౌట్ అని తేలింది. పాపం తాను ఇలా ఔటవుతానని రసెల్ అసలు ఊహించి ఉండడు. తాను ఔటైన తీరుపై నవ్వాలో.. ఏడ్వాలో తెలియక ఆకాశం వైపు చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు.'' విధి అతన్ని ఈ రకంగా వక్రీకరించింది... ఎంత ఘోరం జరిగిపోయింది..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రసెల్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IND Vs SA: అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది
Rajinikant fielding? 😲😲😲pic.twitter.com/aWGwKMJYyG
— Rohit Sankar (@imRohit_SN) January 21, 2022