
England Player Dance Afrter Bangladesh Batsman Run Out.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఒక కన్‌ఫ్యూజ్ రనౌట్ నవ్వులు పూయించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను లివింగ్‌స్టోన్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని కెప్టెన్ మహ్మదుల్లా షార్ట్‌ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న టైమల్ మిల్స్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో మిస్‌ఫీల్డ్ జరిగింది. ఇక్కడే మహ్మదుల్లా రెండో పరుగుకోసం యత్నించాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న ఆఫిఫ్ హొస్సేన్ సగం క్రీజువరకు వచ్చేశాడు. దీంతో మిల్స్ బంతిని వేగంగా బట్లర్‌కు త్రో విసిరాడు. అంతే హొస్సేన్ క్రీజులోకి చేరేలోపే బెయిల్స్ ఎగరడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అయితే ఈ కన్‌ఫ్యూజ్ రనౌట్‌తో ఇంగ్లండ్ ఆటగాడు డ్యాన్స్ చేయడం మిగతావారికి నవ్వులు పంచింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి.
చదవండి: T20 WC 2021: న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్
Confusion galore between Mahmud Ullah and Afif via @t20worldcup https://t.co/BXVu58xBgr
— varun seggari (@SeggariVarun) October 27, 2021
Comments
Please login to add a commentAdd a comment