బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 ఆది నుంచే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది. తాజాగా మరో వివాదంతో ఈ లీగ్ వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఖుల్నా టైగర్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఖలీద్ మహమూద్.. మ్యాచ్ జరగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు.
అసలేం జరిగిందంటే?
ఈ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం(ఫిబ్రవరి10) ఖుల్నా టైగర్స్, ఫార్చ్యూన్ బరిషల్ ఢాకా వేదికగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ జరగుతుండగా ఖలీద్ మహమూద్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇదింతా కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే బాధ్యయుత కోచ్ స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించిన ఖలీద్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "యూరప్‌లో ఆటగాళ్లు ఇలా చేసినందుకు ఆటగాళ్లను సస్పెండ్ చేసారు. అటువంటిది కోచ్ స్థానంలో ఉన్న ఖలీద్ మహ్మద్ డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ ఎలా తాగాడో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా సిగ్గు చేటు అంటూ ట్వీట్ చేశాడు.
చదవండి: IND vs AUS: నా ముఖం కాదురా అయ్యా.. ముందు రిప్లేలు చూపించు! రోహిత్ సీరియస్
@BCBtigers In Europe players are getting suspended for vaping. I don’t understand how Khaled Mahmud Sujon smoked in the dressing room. It was absolutely disgusting to watch.
— Azharul (@Azharulislam07) February 11, 2023
Comments
Please login to add a commentAdd a comment