Khaled
-
డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగిన కోచ్..ఇది నిజంగా సిగ్గు చేటు! వీడియో వైరల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 ఆది నుంచే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది. తాజాగా మరో వివాదంతో ఈ లీగ్ వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఖుల్నా టైగర్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఖలీద్ మహమూద్.. మ్యాచ్ జరగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. అసలేం జరిగిందంటే? ఈ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం(ఫిబ్రవరి10) ఖుల్నా టైగర్స్, ఫార్చ్యూన్ బరిషల్ ఢాకా వేదికగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ జరగుతుండగా ఖలీద్ మహమూద్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇదింతా కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బాధ్యయుత కోచ్ స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించిన ఖలీద్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "యూరప్‌లో ఆటగాళ్లు ఇలా చేసినందుకు ఆటగాళ్లను సస్పెండ్ చేసారు. అటువంటిది కోచ్ స్థానంలో ఉన్న ఖలీద్ మహ్మద్ డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ ఎలా తాగాడో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా సిగ్గు చేటు అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: IND vs AUS: నా ముఖం కాదురా అయ్యా.. ముందు రిప్లేలు చూపించు! రోహిత్ సీరియస్ @BCBtigers In Europe players are getting suspended for vaping. I don’t understand how Khaled Mahmud Sujon smoked in the dressing room. It was absolutely disgusting to watch. — Azharul (@Azharulislam07) February 11, 2023 -
గాజాలో ఇస్లామిక్ జిహాద్ అగ్రనేత హతం
గాజా సిటీ: ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ మధ్య ఘర్షణ నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ఇస్లామిక్ జిహాద్ ఉద్యమానికి అడ్డాగా మారిన గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆదివారం మూడో రోజుకు చేరాయి. శుక్రవారం దాడులు మొదలైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో తాజాగా ఇస్లామిక్ జిహాద్ ఉద్యమ అగ్రనేత ఖలీద్ మన్సూర్ హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు, ఐదుగురు సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత మూడు రోజుల్లో ఇజ్రాయెల్ ప్రకోపానికి బలైన వారి సంఖ్య 31కు చేరింది. ఖలీద్ మన్సూర్ దక్షిణ గాజాలో రఫా శరణార్థుల శిబిరంలోని ఓ అపార్టుమెంట్‌పై నివసిస్తున్నాడు. అదే అపార్టుమెంట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగింది. మరోవైపు ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న ఇస్లామిక్ జిహాద్ సంస్థ కూడా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి వందలాది రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ నడుమ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, గాజాలో అధికారం చెలాయిస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్ మాత్రం ప్రస్తుతానికి మౌనం పాటిస్తోంది. -
హైదరాబాద్‌లో ఉగ్రవాది ఖలీద్ అరెస్ట్
హైదరాబాద్ : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఉగ్రవాది ఖలీద్‌ను ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) మంగళవారం అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అధికారులు ఖలీద్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి పేలుడు పదార్ధాలతో పాటు బాంబు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2న జరిగిన పేలుళ్లలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మయన్మార్ కు చెందిన ఖలీద్ హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు సాజిద్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) ఉగ్రవాద సంస్థ చీఫ్ కమాండర్ అయిన సాజిద్‌పై నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రూ. పది లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంటిలో.. అక్టోబర్ రెండో తేదీన పేలుడు సంభవించి షకీల్ అహ్మద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి సోవన్ మండల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిద్దరికీ జెఎంబి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.