బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ మెరుపు శతకం.. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం | BPL 2024: Tanzid Hasan Tamim Slams Twenty20 Century Against Khulna Tigers - Sakshi
Sakshi News home page

BPL 2024: బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ మెరుపు శతకం.. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం

Published Tue, Feb 20 2024 3:05 PM | Last Updated on Tue, Feb 20 2024 3:11 PM

BPL 2024: Chattogram Challengers Opener Tanzid Hasan Smashes Blasting Century Vs Khulna Tigers - Sakshi

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో చట్టోగ్రామ్‌ ఛాలెంజర్స్‌ బ్యాటర్‌, బంగ్లాదేశ్‌ జాతీయ జట్టు ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఖుల్నా టైగర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 20) జరుగుతున్న మ్యాచ్‌లో తంజిద్‌ 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న తంజిద్‌ 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ప్రస్తుత బీపీఎల్‌ సీజన్‌లో తంజిద్‌ చేసిన సెంచరీ మూడవది. తంజిద్‌కు ముందు తౌహిద్‌ హ్రిదోయ్‌, విల్‌ జాక్స్‌ సెంచరీలు చేశారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఛాలెంజర్స్‌ ఇన్నింగ్స్‌లో తంజిద్‌ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్‌ బ్రూస్‌ (23 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్‌ వసీం​ (1), సైకత్‌ అలీ (18), రొమారియో షెపర్డ్‌ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్‌ బౌలర్లలో వేన్‌ పార్నెల్‌, నసుమ్‌ అహ్మద్‌, జేసన్‌ హోల్డర్‌, ముకిదుల్‌ ఇస్లాం తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్‌ నిదానంగా ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఆ జట్టు తొలి ఓవర్‌ ముగిసే సరికి కేవలం రెండు పరుగులు (వికెట్‌ నష్టపోకుండా) మాత్రమే చేయగలిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement