
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో(బీపీఎల్ 2022) ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. కొమిల్లా విక్టోరియన్స్, కుల్నా టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అయితే 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 35 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న మొయిన్ అలీ.. 8 సిక్సర్లతో ఫిఫ్టీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత ఒక సిక్స్, ఒక ఫోర్ బాది మొత్తం 75 పరుగులు రాబట్టాడు. అతనికి జతగా డుప్లెసిస్ 38 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కుల్నా టైగర్స్ 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. తిసార పెరీరా 26 పరుగులతో టాప స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్‌లో గత సీజన్‌లో సీఎస్‌కే తరపున దుమ్మురేపిన మొయిన్ అలీని ఆ జట్టు రిటైన్ చేసుకుంది.
Moeen Ali madness in BPL scored 50 from just 23 balls with 8 sixes 🔥🤯#BPL2022 #Cricketpic.twitter.com/LDyUrAPstd
— CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 11, 2022