
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ మాములుగా లేదు. దేశాలు దాటి విదేశాలను చుట్టేస్తున్న పుష్ప మేనియా ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)కు కూడా పాకింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన..'' యవ్వ తగ్గేదే లే..'' అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు సహా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తమదైన శైలిలో పుష్ప సినిమా డైలాగ్ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు.
తాజాగా బీబీఎల్ 2022 లీగ్ మ్యాచ్‌లో అమితే హసన్ అనే బౌలర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. వికెట్ తీసిన ఆనందంలో.. అల్లు అర్జున్‌ను గుర్తు చేస్తూ తన గడ్డంపై చేయి పెట్టి ''నీ యవ్వ..తగ్గేదే లే'' అన్నట్లుగా మేనరిజం చేసి చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. కాగా పుష్పలోని ''శ్రీవల్లీ'' పాటకు ఇటీవలే వార్నర్ స్టెప్పులు వేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment