cinema dialogues
-
కాంగ్రెస్ నేతలవి సినిమా డైలాగులు : ప్రధాని మోదీ
రాట్లం: కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రధాని మోదీ సెటైర్ల మీద సెటైర్లు వేశారు. శనివారం మధ్యప్రదేశ్ రాట్లంలో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల డైలాగులు, ప్రకటనలు,వారి క్యారెక్టర్లు అన్నీ సినిమా తరహాలోనే ఉంటాయని చమత్కరించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో బట్టలు చింపుకునే పోటీ జరుగుతోందని మోదీ అన్నారు. డిసెంబర్3న ఎన్నికల రిజల్ట్ రాగానే ఇది మరింత తీవ్రం అవుతుందని చెప్పారు.కాంగ్రెస్ నేతలకు చాన్సిస్తే ప్రజల ఒంటి మీద కూడా బట్టలు చింపేస్తారని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టుకోవడం లేదన్నారు పీఎం మోదీ. వాళ్లు వారి కొడుకుల కోసం కొట్టుకుంటున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎవరి కొడుకు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలనేది వారి తపన అని ఎద్దేవా చేశారు.కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ఇద్దరు అగ్రనేతలు కమల్‌నాథ్, దిగ్విజయసింగ్ మధ్య అంతర్గత పోరు జరుగుతున్నవిషయం తెలిసిందే -
ఔట్ చేసిన ఆనందం 'నీ యవ్వ తగ్గేదే లే'
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ మాములుగా లేదు. దేశాలు దాటి విదేశాలను చుట్టేస్తున్న పుష్ప మేనియా ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)కు కూడా పాకింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన..'' యవ్వ తగ్గేదే లే..'' అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు సహా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తమదైన శైలిలో పుష్ప సినిమా డైలాగ్ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా బీబీఎల్ 2022 లీగ్ మ్యాచ్‌లో అమితే హసన్ అనే బౌలర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. వికెట్ తీసిన ఆనందంలో.. అల్లు అర్జున్ను గుర్తు చేస్తూ తన గడ్డంపై చేయి పెట్టి ''నీ యవ్వ..తగ్గేదే లే'' అన్నట్లుగా మేనరిజం చేసి చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. కాగా పుష్పలోని ''శ్రీవల్లీ'' పాటకు ఇటీవలే వార్నర్ స్టెప్పులు వేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. -
మళ్లీ పెన్ను పట్టనున్న కమల్ హాసన్
చెన్నై: సకల కళ వల్లభుడు కమల్ హాసన్ మళ్లీ పెన్ను పట్టనున్నారు. కమల్ హాసన్ హీరోగా తాజాగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉత్తమ విలన్'. ఆ చిత్రానికి కమల్ మాటలు అందించనున్నారని ప్రముఖ నటుడు, ఆ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ వెల్లడించారు. ఈ చిత్రానికి మాటలు రాసేందుకు ముందుగా క్రేజీ మోహన్‌ను అనుకున్నామని కానీ కమల్‌ను ఎంచుకున్నామని చెప్పారు. మాటల రచయితగా కమల్ వంద శాతం న్యాయం చేస్తారని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఆయన వివరించారు. మలయాళంలో రూపొందించిన దృశ్యం చిత్రం రీమేక్ పాపనాశమా తమిళ థ్రిల్లర్‌లో నటిస్తూ కమల్ యమా బిజీగా ఉన్నారని రమేష్ అరవింద్ చెప్పారు.