
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ‘పుష్ప’ మానియా వదలడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలోని.. ‘‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’’ పాటకు కాలు కదిపిన వార్నర్.. శ్రీ వల్లి పాటకు కూడా అదిరిపోయేలా స్టెప్పులేశాడు. అతడి కూతుళ్లు సైతం ‘సామీ నా సామీ’ పాటకు తమదైన శైలిలో డాన్స్ చేసి అలరించారు. తాజాగా మరోసారి పుష్ప పట్ల అభిమానం చాటుకున్నాడు ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్. ఈ సారి... ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్’’ అంటూ డైలాగ్‌తో అలరించాడు. కూతురితో కలిసి హిందీ డైలాగ్‌కు లిప్ సింక్ చేశాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వార్నర్ ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘‘నా కోసం ఈ డైలాగ్ పూర్తి చేయండి. ఇండియా మొత్తం జాయిన్ అవ్వాలి. సరిగా లిప్ సింక్ చేయలేకపోయాను సారీ’’అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వార్నర్ భార్య కాండిస్ వార్నర్.. కూతురిని ఎంకరేజ్ చేస్తూ ‘గో ఇండీ’ అంటూ కామెంట్ చేశారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ వీడియోపై స్పందించాడు. ఫైర్ ఎమోజీలను జతచేశాడు.
కాగా వార్నర్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆడాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో అతడు ఆక్షన్‌లోకి రానున్నాడు. సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించిన వార్నర్‌ను ఆ జట్టు రిటైన్ చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇక టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్న వార్నర్ భాయ్ కోసం ఈసారి వేలంలో ఫ్రాంఛైజీల మధ్య పోటాపోటీ నెలకొనే అవకాశం ఉంది.
చదవండి: India Test Captain: రోహిత్ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్ అవసరమా?
Aakash Chopra : అతను కెప్టెన్ కాలేడు.. అయినా భారీ ధర పలకడం ఖాయం..!
IND vs WI: టీమిండియా వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్!
Comments
Please login to add a commentAdd a comment