BPL 2022: Shakib Al Hasan Dancing For Allu Arjun Pushpa Srivalli Song, Video Viral - Sakshi
Sakshi News home page

Shakib Al Hasan: 'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్‌రౌండర్‌ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్‌

Published Thu, Jan 27 2022 12:11 PM | Last Updated on Thu, Jan 27 2022 1:04 PM

Shakib Al Hasan Copies Allu Arjun Move From Pushpa Movie But Twist Viral - Sakshi

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌.. డేవిడ్‌ వార్నర్‌, డ్వేన్‌ బ్రావో, సురేశ్‌ రైనాల సరసన చేరాడు. అయితే క్రికెట్‌ రికార్డులు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే షకీబ్‌ జాయిన్‌ అయింది.. పుష్ప సినిమా క్లబ్‌లో. ఏ ముహుర్తానా పుష్ప సినిమా మొదలైందో గాని..థియేటర్ల నుంచి సినిమా వెళ్లిపోయినప్పటికి.. దాని ప్రభావం మాత్రం జనాలను విడవడం లేదు. పాటలు, డైలాగ్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా చాలా విశేషాలున్నాయి. ఇప్పటికే డేవిడ్‌ వార్నర్‌ నుంచి డ్వేన్‌ బ్రావో దాకా.. రవీంద్ర జడేజా నుంచి సురేశ్‌ రైనా వరకు పుష్ప సినిమాలో నుంచి ఏదో ఒక దానిపై వీడియోలు చేసి జనాలను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.  తాజాగా షకీబ్‌ అల్‌ హసన్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌)లో మరోసారి పుష్ప స్టెప్పులతో మెరిశాడు. అయితే చివర్లో షకీబ్‌ ఇచ్చిన ట్విస్ట్‌ మాత్రం అదిరింది.

చదవండి: Dwayne Bravo: వికెట్ ప‌డ‌గొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు

లీగ్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్‌, ఫార్చూన్‌ బారిషల్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. కొమిల్లా విక్టోరియన్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో డుప్లెసిస్‌ను ఔట్‌ చేసిన తర్వాత.. షకీబ్‌ అ‍ల్లు అర్జున్‌ ''తగ్గేదే లే'' మేనరిజమ్‌కు శ్రీవల్లీ పాటను జత చేసి డ్యాన్స్‌ చేశాడు.  శ్రీవల్లీ పాటలో లెగ్‌ మూమెంట్‌ ఎంత పాపులర్‌ అయిందో అందరికి తెలిసిందే. అయితే షకీబ్‌ మాత్రం లెగ్‌ మూమెంట్‌ కాకుండా.. తన చేతులతోనే.. ఒకవైపు తగ్గేదే లే అంటూనే.. మరోవైపు శ్రీవల్లీ పాట డ్యాన్స్‌ చూపించాడు. షకీబ్‌ చేసిన కొత్త స్టెప్‌ను ట్విటర్‌లో షేర్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌ అయింది. 

ఇక మ్యాచ్‌లో షకీబ్‌ సారధ్యంలోని ఫార్చూన్‌ బారీషల్‌ 63 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కొమిల్లా విక్టోరియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ 48 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఫార్చూన్‌ బారిషల్‌ 95 పరుగులకే కుప్పకూలింది.  

చదవండి: తలకు బలమైన గాయం.. అనుకున్నది సాధించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement