BPL 2022: Dwayne Bravo Performs Hook Steps of Srivalli From Famous Movie Pushpa - Sakshi
Sakshi News home page

Dwayne Bravo: వికెట్ ప‌డ‌గొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు

Published Wed, Jan 26 2022 2:21 PM | Last Updated on Wed, Jan 26 2022 4:11 PM

Dwayne Bravo performs hook steps of Srivalli from famous movie Pushpa - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. పుష్ప.. సినీ ప్ర‌పంచాన్నే కాకుండా క్రికెట్ ప్ర‌పంచాన్ని కూడాఓ ఊపు ఊపేస్తోంది. సాధారణంగా బౌల‌ర్ వికెట్ తీసినప్పుడు త‌నదైన శైలిలో సెల‌బ్రేష‌న్ జ‌ర‌పుకుంటారు. కానీ ప్ర‌స్తుతం బౌల‌ర్లు పుష్ప డైలాగ్‌లు, పాట‌ల‌కు స్టెప్ప‌లేసి సంబరాలు జ‌ర‌పుకుంటాన్నారు. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట‌కు అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా తాజాగా వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావో కూడా శ్రీవ‌ల్లీ పాట‌కు  స్టెప్పులేశాడు.

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్ ,ఫార్చ్యూన్ బారిషల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్రావో బౌలింగ్‌లో మహిదుల్ ఇస్లాం అంకాన్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించ‌గా.. అది మిస్‌టైమ్ అయ్యి ఫీల్డ‌ర్ చేతికి వెళ్లింది. ఈ క్ర‌మంలో వికెట్ తీసిన సంతోషంలో బ్రావో శ్రీవల్లి పాట‌కు స్టెప్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement