బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చూన్ బారిషల్ ఆటగాడు కైల్ మేయర్స్ (వెస్టిండీస్) ఆల్‌రౌండ్ షోతో ఇరగదీశాడు. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మెరుపు అర్దశతకం (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సహా రెండు వికెట్లు (4-0-28-2) తీసి తన జట్టును గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో రాణించిన మేయర్స్ ఆతర్వాత బ్యాటింగ్‌లో మెరిశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కైల్ మేయర్స్, సైఫుద్దీన్, మెక్‌కాయ్ తలో 2 వికెట్లు తీసి ఛాలెంజర్స్ పతనాన్ని శాశించారు. తైజుల్ ఇస్లాం, జేమ్స్ ఫుల్లర్ చెరో వికెట్ పడగొట్టారు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో జోష్ బ్రౌన్ చేసిన 34 పరుగులే అత్యధికం. కెప్టెన్ షువగట (24), ట్రామ్ బ్రూస్ (17), సైకత్ అలీ (11), రొమారియో షెపర్డ్ (11), నిహాదుజ్జమాన్ (10) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లు కనీసం ఈపాటి పరుగులు కూడా సాధించలేకపోయారు.
అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. కైల్ మేయర్స్, తమీమ్ ఇక్బాల్ (52 నాటౌట్) చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఫలితంగా బారిషల్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.
బారిషల్ ఇన్నింగ్స్‌లో సౌమ్య సర్కార్ (0) విఫలం కాగా.. డేవిడ్ మిల్లర్ (17) వేగంగా పరుగులు సాధించాడు. ముష్ఫికర్ రహాం (6 నాటౌట్) విన్నింగ్ రన్స్ కొట్టాడు. ఛాలెంజర్స్ బౌలర్లలో షువగట, బిలాల్ ఖాన్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. రంగ్పూర్ రైడర్స్, కొమిల్లా విక్టోరియన్స్ మధ్య ఇవాళ రాత్రి క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫిబ్రవరి 28న జరిగే క్వాలిఫయర్-2లో ఫార్చూన్ బారిషల్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment