బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024-25లో వెస్టిండీస్ బౌలర్ ఒషేన్ థామస్ చెత్త ప్రదర్శన చేశాడు. ఈ లీగ్‌లో ఖుల్నా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న థామస్.. చిట్టగాంగ్ కింగ్స్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో ఒక్క బంతికి ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు.
15 runs off 1 ball! 😵💫
Talk about an eventful way to start the innings! #BPLonFanCode pic.twitter.com/lTZcyVEBpd— FanCode (@FanCode) December 31, 2024
ఛేదనలో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన థామస్ వరుసగా N 0 N6 Wd Wd N4 0 0 N 2 W 0 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో ఇదో చెత్త ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్ వేసిన థామస్ 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. థామస్ ఓవర్‌లో 4 నో బాల్స్, 2 వైడ్లు ఉన్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరగుల భారీ స్కోర్ చేసింది. బొసిస్టో (50 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), మహిదుల్ ఇస్లాం అంకోన్ (22 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు.
ఖుల్నా టైగర్స్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నయీమ్ 26, కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ 18, ఇబ్రహీం జద్రాన్ 6, అఫీఫ్ హొసేన్ 8 పరుగులు చేశారు. చిట్టగాంగ్ బౌలర్లలో అలిస్ అల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చిట్టగాంగ్ 18.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అబూ హైదర్ (3.5-0-44-4), మొహమ్మద్ నవాజ్ (3-0-13-2) చిట్టగాంగ్ టైగర్స్‌ను దెబ్బకొట్టారు. ఒషేన్ థామస్, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
చిట్టగాంగ్ ఇన్నింగ్స్‌లో షమీమ్ హొసేన్ (38 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షమీమ్ ఒంటరిగా పోరాడి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. షమీమ్ మినహా చిట్టగాంగ్ ఇన్నింగ్స్‌లో నయీమ్ ఇస్లాం (12), పర్వేజ్ హొసేన్ ఎమోన్ (13), ఉస్మాన్ ఖాన్ (18), ఖలీద్ అహ్మద్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment