Oshane Thomas
-
విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్
న్యూఢిల్లీ: సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకోవడంతో ఆయా ఫ్రాంచైజీలు వారి స్థానాలను భర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇదివరకే చాలా జట్లు రిప్లేస్మెంట్ ఆటగాళ్లును ఎంపిక చేసుకున్నాయి. తాజాగా, రాజస్తాన్ రాయల్స్ జట్టు వ్యక్తిగత కారణాల చేత లీగ్‌కు దూరంగా ఉన్న జోస్ బట్లర్ స్థానాన్ని విండీస్ విధ్వంసకర యోధుడు ఎవిన్ లూయిస్‌తో భర్తీ చేయాలని నిర్ణయించింది. అలాగే గాయం కారణంగా లీగ్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్లేస్‌ను విండీస్‌కే చెందిన ఒషేన్ థోమాస్‌తో రీప్లేస్ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఒషేన్ థోమాస్కు ఐపీఎల్లో ఇదే జట్టుకు 4 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇక ఎవిన్ లూయిస్ విషయానికొస్తే.. ఈ పవర్ హిట్టర్ గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు 16 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ముంబై తరఫున అతను 131 స్ట్రయిక్ రేట్‌తో 430 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా, ఎవిన్ లూయిస్‌కు అంతర్జాతీయ టీ20ల్లో హార్డ్ హిట్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. అతను విండీస్ తరఫున 45 మ్యాచ్‌ల్లో 158 స్ట్రయిక్ రేట్‌తో 1318 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, సంజూ సామ్సన్ నేతృత్వంలోని ఆర్ఆర్ జట్టు ఐపీఎల్ సెకెండ్ లెగ్‌లో తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 21న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్.. పంజాబ్ కింగ్స్‌ను ఢీకొంటుంది. ప్రస్తుత సీజన్లో ఆర్ఆర్ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడండి.. టీమిండియా దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుంది -
గేల్ మళ్లీ ‘సిక్సర’ పిడుగులా...
సెయింట్ లూసియా: వన్డే సిరీస్‌లో ఆఖరి దెబ్బతో వెస్టిండీస్ ఆదరగొట్టింది. బౌలింగ్‌లో ఒషాన్ థామస్ (5/21) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కూల్చేస్తే... వెటరన్ ఓపెనర్ క్రిస్ గేల్ (27 బంతుల్లోనే 77; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మళ్లీ చెలరేగాడు. దీంతో ఐదో వన్డేలో మరో 37.5 ఓవర్లు మిగిలుండగానే విండీస్ 7 వికెట్ల తేడాతో ఆలవోక విజయం సాధించింది. ఈ సిరీస్ ఆసాంతం సిక్సర్ల సునామీ సృష్టించిన గేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ లభించింది. అతను నాలుగే మ్యాచ్‌ల్లో (మూడోది రద్దయింది) 424 పరుగులు చేయడం విశేషం. 39 సిక్సర్లు బాదిన ఈ డాషింగ్ ఓపెనర్ 106 సగటు నమోదు చేయడం మరో విశేషం. క్రికెట్ చిత్రమంటే ఇదేనేమో! నాలుగు రోజుల క్రితమే ఇంగ్లండ్ 418 పరుగుల (నాలుగో వన్డేలో) భారీస్కోరు చేసింది. శనివారం రాత్రి జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం 28.1 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. కేవలం 9వ వన్డే ఆడుతున్న 22 ఏళ్ల పేసర్ ఒషాన్ థామస్ ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీశాడు. క్రీజులో నిలబడనీయకుండా, ఖాతా తెరవకుండా తన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కూల్చేశాడు. అతని ధాటికి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ మోర్గాన్ (18), బట్లర్ (23), మొయిన్ అలీ (12) నిలువలేదు. టెయిలెండర్లు వోక్స్ (0), కరన్ (0) పరుగైనా చేయలేకపోయారు. తర్వాత స్వల్ప లక్ష్యఛేదనను గేల్ వాయు వేగంతో çపూర్తిచేశాడు. విండీస్ 12.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. 8వ ఓవర్లో జట్టు స్కోరు 93 పరుగుల వద్ద గేల్ నిష్క్రమించాడు. ఇందులో గేల్ చేసినవే 77 పరుగులు. మిగతా లాంఛనాన్ని బ్రేవో (7 నాటౌట్), హెట్‌మైర్ (11 నాటౌట్) పూర్తి చేశారు. ఐదు వన్డేల సిరీస్ 2–2తో సమమైంది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం గ్రాస్ ఐలెట్‌లో జరుగుతుంది. -
అరంగేట్రంలోనే చెత్త రికార్డు
గువాహటి: టీమిండియాతో జరిగిన తొలి వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వెస్టిండీస్ పేసర్ ఓషేన్ థామస్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్ థామస్ 83 పరుగుల్ని సమర్పించుకున్నాడు. తొమ్మిది ఓవర్లపాటు బౌలింగ్ వేసిన వికెట్ మాత్రమే సాధించి 80కి పైగా పరుగులిచ్చాడు. ఫలితంగా వెస్టిండీస్ తరపున అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. అంతకుముందు విలియమ్స్ అరంగేట్రం మ్యాచ్‌లోనే 69 పరుగులు సమర్పించుకోగా, థామస్ దాన్ని తిరగరాసి చెత్త గణాంకాలను నమోదు చేశాడు. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో ఓవర్లోనే శిఖర్ ధావన్‌ను బౌల్డ్ చేసిన థామస్.. ఆపై ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్-కోహ్లిల జోరుకు భారీగా పరుగులు సమర్పించుకుని వికెట్ తీసిన ఆనందాన్ని ఎక్కువసేపు నిలుపుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (140), రోహిత్ శర్మ(152 నాటౌట్)లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. మహ్మద్ షమీ చెత్త రికార్డు