గువాహటి: టీమిండియాతో జరిగిన తొలి వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట‍్రం చేసిన వెస్టిండీస్ పేసర్ ఓషేన్ థామస్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్ థామస్ 83 పరుగుల్ని సమర్పించుకున్నాడు. తొమ్మిది ఓవర్లపాటు బౌలింగ్ వేసిన వికెట్ మాత్రమే సాధించి 80కి పైగా పరుగులిచ్చాడు. ఫలితంగా వెస్టిండీస్ తరపున అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. అంతకుముందు విలియమ్స్ అరంగేట్రం మ్యాచ్‌లోనే 69 పరుగులు సమర్పించుకోగా, థామస్ దాన్ని తిరగరాసి చెత్త గణాంకాలను నమోదు చేశాడు. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో ఓవర్‌లోనే శిఖర్ ధావన్‌ను బౌల్డ్ చేసిన థామస్.. ఆపై ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్-కోహ్లిల జోరుకు భారీగా పరుగులు సమర్పించుకుని వికెట్ తీసిన ఆనందాన్ని ఎక్కువసేపు నిలుపుకోలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (140), రోహిత్ శర్మ(152 నాటౌట్)లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment