పుణె: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లి.. మూడో వన్డేలో 63 బంతుల్లో 6 ఫోర్లతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇక 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(8) మరోసారి నిరాశపరిచాడు. అనంతరం ధావన్‌తో కలిసి కోహ్లి ఆచితూచి ఆడాడు. మంచి టచ్‌లోకి వచ్చినట్టే కనిపించిన ధావన్ (35) అశ్లే నర్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన తెలుగుతేజం అంబటి రాయుడుతో లక్ష్యం దిశగా పోరాడుతున్నాడు.
విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ హాఫ్ సెంచరీ చూసిన తరువాత అతని మాటలు ఇప్పుడు నిజమే అనిపిస్తున్నాయి. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి పరుగులు చేసేస్తున్నాడు. మరో శతకం దిశగా దూసుకెళ్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment