కళ్లు చెదిరే క్యాచ్‌.. రొమారియో షెపర్డ్‌ అద్భుత విన్యాసం | BPL 2024: Romario Shepherd Takes Unbelievable Catch Of Anamul Haque | Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరే క్యాచ్‌.. రొమారియో షెపర్డ్‌ అద్భుత విన్యాసం

Published Tue, Feb 20 2024 7:47 PM | Last Updated on Tue, Feb 20 2024 7:53 PM

BPL 2024: Romario Shepherd Takes Unbelievable Catch Of Anamul Haque - Sakshi

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో చట్టోగ్రామ్‌ ఛాలెంజర్స్‌ ఆటగాడు, విండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్నాడు. ఖుల్నా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనాముల్‌ హక్‌ కొట్టిన షాట్‌ను షెపర్డ్‌ అద్భుత క్యాచ్‌గా మలిచాడు. షొహిదుల్‌ ఇస్లాం బౌలింగ్‌లో షెపర్డ్‌ రివర్స్‌లో పరిగెడుతూ బౌండరీ లైన్‌ సమీపంలో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన చట్టోగ్రామ్‌ ఛాలెంజర్స్‌ 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తంజిద్‌ హసన్‌ (116) మెరుపు సెంచరీ చేసి ఛాలెంజర్స్‌ భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడ్డాడు. 

58 బంతుల్లో శతక్కొట్టిన తంజిద్‌.. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 65 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఛాలెంజర్స్‌ ఇన్నింగ్స్‌లో తంజిద్‌ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్‌ బ్రూస్‌ (23 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్‌ వసీం​ (1), సైకత్‌ అలీ (18), రొమారియో షెపర్డ్‌ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్‌ బౌలర్లలో వేన్‌ పార్నెల్‌, నసుమ్‌ అహ్మద్‌, జేసన్‌ హోల్డర్‌, ముకిదుల్‌ ఇస్లాం తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్‌...షువగటా హోమ్‌ (3/25), బిలాల్‌ ఖాన్‌ (2/13),  సలావుద్దీన్‌ (1/15), షొహిదుల్‌ ఇస్లాం (1/18), రొమారియో షెపర్డ్‌ (1/25), నిహాదుజ్జమాన్‌ (1/29) ధాటికి 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టైగర్స్‌ ఇన్నింగ్స్‌లో అనాముల్‌ హక్‌ (35), షాయ్‌ హోప్‌ (31), జేసన్‌ హోల్డర్‌ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement