పాకిస్తాన్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హరీస్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఊహించని షాకిచ్చింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గోనేందుకు ఢాకాకు వెళ్లిన హరీస్‌కు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఓసి) ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించింది. దీంతో అతడు ఢాకా విమానాశ్రయం నుంచే స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
లగేజీ ఫోటోలను షేర్ చేస్తూ బ్యాక్ టూ హోమ్ అని రాసుకొచ్చాడు. అయితే పీసీబీ రూల్స్ ప్రకారం.. ఆ దేశ క్రికెటర్లు రెండు విదేశీ లీగ్‌లు ఆడేందుకు మాత్రమే అర్హులు. కానీ హ్యారీస్ ఇప్పటికే రెండు ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే మూడో లీగ్‌లో ఆడేందుకు అతడికి పీసీబీ ఎన్‌ఓసి జారీ చేయలేదు.
కాగా బీబీఎల్‌లో చట్టోగ్రమ్ ఛాలెంజర్స్ తరఫున ఆడాల్సి ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును తప్పుబడుతున్నారు. ఎన్‌ఓసి విషయం అతడికి ముందే చెప్పి ఉంటే ఢాకా వరకు వెళ్లే వాడు కాదు కదా అంటూ మండిపడుతున్నారు. కాగా పాక్ తరపున ఇప్పటివరకు 9 టీ20లు ఆడిన మహ్మద్ హరీస్.. 126 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు!
Mohammad Haris had asked the Pakistan Cricket Board for a NOC and was told to go to Bangladesh for the BPL. He arranged for a flight on 17th January and was told by PCB that they will give him the NOC on 18th January. After arriving in Bangladesh, the PCB refused to give him a… pic.twitter.com/YuT70wZv7J
— Saj Sadiq (@SajSadiqCricket) January 21, 2024
Comments
Please login to add a commentAdd a comment