Mohammad Haris
-
'మేము ఓడిపోయినందుకు చాలా హ్యాపీ'.. పాక్ క్రికెటర్‌పై ట్రోల్స్ వర్షం
పాకిస్తాన్ క్రికెటర్లందరూ ప్రస్తుతం ఛాంపియన్స్ వన్డే కప్‌లో బీజీబీజీగా ఉన్నారు. కెప్టెన్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఈ టోర్నమెంట్లో భాగమయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జాతీయ జట్టును పటిష్టం చేసేందుకు చాంపియన్స్ వన్డే కప్‌తో పాటు చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట మూడు టోర్నీలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.అందులో భాగంగానే తొలుత ఛాంపియన్స్ వన్డే కప్‌ను పీసీబీ నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో మార్ఖోర్స్, స్టాలియన్స్, పాంథర్స్, డాల్ఫిన్స్, లయన్స్ పేరిట ఐదు జట్లు పాల్గోంటున్నాయి. మార్ఖోర్స్కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహిస్తుండగా.. స్టాలియన్స్‌కు మహ్మద్ హ్యారిస్, పాథర్స్కు షాదాబ్ ఖాన్, డాల్ఫిన్స్‌కు సౌద్ షకీల్, లయన్స్‌కు షాహీన్ షా అఫ్రిది కెప్టెన్లుగా ఉన్నారు.హ్యారిస్‌పై ట్రోల్స్ వర్షం..కాగా టోర్నీలో భాగంగా సోమవారం మార్కోర్స్తో స్టాలియన్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టాలియన్స్ 105 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ అనంతరం స్టాలియన్స్ కెప్టెన్ మహ్మద్ హారిస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోయినందుకు సంతోషంగా ఉందని చెప్పడంతో హ్యారీస్‌ను అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.మేము ఈ మ్యాచ్‌లో ఎటువంటి తప్పిదాలు చేయలేం. మా జట్టు బలాలు, బలహీనతలను పరీక్షించుకున్నాము. గత మ్యాచ్‌లో మేము టాస్ గెలిచి తొలుత మా బ్యాటింగ్ బలాన్ని చెక్ చేశాము. ఆ మ్యాచ్‌లో కూడా ఓడి పోయాము. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మా బౌలింగ్ యూనిట్ బలాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాము. కానీ ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి చూశాం. మా బలాలు, బలహీనతలు ఎంటో తెలుసుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి అంటూ హ్యారీస్ పేర్కొన్నాడు. దీంతో హ్యారీస్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.చదవండి: SL vs NZ: కివీస్‌తో తొలి టెస్టు.. శ్రీలంక తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
పాకిస్తాన్ బ్యాటర్ కు ఊహించని షాక్ ఇచ్చిన బోర్డు
-
పాకిస్తాన్ బ్యాటర్‌కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!?
పాకిస్తాన్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హరీస్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఊహించని షాకిచ్చింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గోనేందుకు ఢాకాకు వెళ్లిన హరీస్‌కు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసి) ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించింది. దీంతో అతడు ఢాకా విమానాశ్రయం నుంచే స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. లగేజీ ఫోటోలను షేర్ చేస్తూ బ్యాక్ టూ హోమ్ అని రాసుకొచ్చాడు. అయితే పీసీబీ రూల్స్ ప్రకారం.. ఆ దేశ క్రికెటర్లు రెండు విదేశీ లీగ్‌లు ఆడేందుకు మాత్రమే అర్హులు. కానీ హ్యారీస్ ఇప్పటికే రెండు ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే మూడో లీగ్‌లో ఆడేందుకు అతడికి పీసీబీ ఎన్ఓసి జారీ చేయలేదు. కాగా బీబీఎల్‌లో చట్టోగ్రమ్ ఛాలెంజర్స్ తరఫున ఆడాల్సి ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును తప్పుబడుతున్నారు. ఎన్ఓసి విషయం అతడికి ముందే చెప్పి ఉంటే ఢాకా వరకు వెళ్లే వాడు కాదు కదా అంటూ మండిపడుతున్నారు. కాగా పాక్ తరపున ఇప్పటివరకు 9 టీ20లు ఆడిన మహ్మద్ హరీస్.. 126 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! Mohammad Haris had asked the Pakistan Cricket Board for a NOC and was told to go to Bangladesh for the BPL. He arranged for a flight on 17th January and was told by PCB that they will give him the NOC on 18th January. After arriving in Bangladesh, the PCB refused to give him a… pic.twitter.com/YuT70wZv7J — Saj Sadiq (@SajSadiqCricket) January 21, 2024 -
Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..
Asia Cup 2023- Pakistan Vs Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కీలక ఆటగాడిపై వేటు వేసినందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ గెలవడం మాట అటుంచితే.. ఫైనల్ చేరడమే కష్టమని.. ఇక ఇంటికి వచ్చేందుకు సిద్ధం కావాలంటూ పాక్ జట్టును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తున్నారు. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఈ దుస్థితిలో కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. శ్రీలంకతో చావోరేవో తేల్చుకోనుంది. కొలంబో వేదికగా గురువారం నాటి ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భారత్‌తో పాటు ఫైనల్‌కు చేరుకుంటుంది. గాయాల కారణంగా కీలక పేసర్లు అవుట్ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్‌ను ఓ వైపు గాయాల బెడద వెంటాడుతుంటే.. మరోవైపు.. ఓపెనర్ ఫఖర్ జమాన్‌ను తప్పిస్తూ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. లంకతో మ్యాచ్‌కు ముందు పాక్ బుధవారమే తమ తుది జట్టును ప్రకటించింది. లంకతో మ్యాచ్‌లో ఏకంగా ఐదు మార్పులు స్టార్ పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్, ఆఘా సల్మాన్ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. వారి స్థానాల్లో జమాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఫహీం ఆష్రఫ్పై వేటు పడగా.. మహ్మద్ నవాజ్ జట్టులోకి వచ్చాడు. అయితే, వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ స్థానంలో మహ్మద్ హ్యారిస్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో వేటు! ఇప్పటి వరకు ఈ వన్డే టోర్నీలో మొత్తంగా ఆడిన మూడు ఇన్నింగ్స్‌లో ఫఖర్ జమాన్ కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో 50 బంతులు ఆడి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, పాక్ ఇన్నింగ్స్‌లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో ఫఖర్ జమాన్‌పై వేటు పడింది. అయితే, డూ ఆర్ డై మ్యాచ్‌లో అతడిని తప్పించడం జట్టుకు మైనస్‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస సెంచరీలు.. ద్విశతక వీరుడు తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న అనుభవం ఉన్న ఆటగాడిని కాదని హ్యారిస్‌ను ఆడించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఫఖర్ జమాన్ వరుస సెంచరీలు సాధించాడు. రెస్ట్ పేరిట వేటు? జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న ఫఖర్ జమాన్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చిన మేనేజ్మెంట్ ఓపిక నశించి ఈసారి రెస్ట్ పేరిట వేటు వేసినట్లు తెలుస్తోంది. హ్యారిస్ రికార్డు గణాంకాలేమో ఇలా ఇక ఇప్పటి వరకు పాక్ తరఫున 76 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3268 పరుగులు సాధించాడు. ఫఖర్ జమాన్ ఖాతాలో 10 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. పాక్ తరఫున వన్డేల్లో ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్ అతడే! ఇదిలా ఉంటే.. ఫఖర్ జమాన్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన మహ్మద్ హ్యారిస్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 5 వన్డేల్లో కలిపి 27 పరుగులు సాధించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. గందరగోళ పరిస్థితుల్లో లంక చేతిలో పాకిస్తాన్ చిత్తు కావడం ఖాయమంటూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! -
హరీస్ ఉతుకుడు.. హసరంగ 'ఆరే'సుడు
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా జాఫ్నా కింగ్స్‌తో నిన్న (ఆగస్ట్ 17) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బి లవ్ క్యాండీ ఘన విజయం సాధించింది. క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగ తన స్పిన్ మాయాజాలంతో జాఫ్నా కింగ్స్‌ను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేశాడు. అంతకుముందు మహ్మద్ హరీస్ బ్యాట్‌తో చెలరేగడంతో క్యాండీ టీమ్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. Highlights from the best bowling figures in LPL history by Wanindu Hasaranga.#LPL2023 #LiveTheAction pic.twitter.com/wkyK1kIzxG — LPL - Lanka Premier League (@LPLT20) August 17, 2023 హరీస్ ఉతుకుడు.. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. ఓపెనర్ మహ్మద్ హరీస్ (49 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ చండీమల్ (24 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. క్యాండీ ఇన్నింగ్స్‌లో హరీస్, చండీమల్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. జాఫ్నా బౌలర్లలో నువాన్ తుషార 4 వికెట్లతో విజృంభించగా.. మహీష్ తీక్షణ, గుణరత్నే తలో 2 వికెట్లు పడగొట్టారు. Highlights from Mohammad Haris' splendid knock.#LPL2023 #LiveTheAction pic.twitter.com/qzWS5uwzsO — LPL - Lanka Premier League (@LPLT20) August 17, 2023 హసరంగ 'ఆరే'సుడు.. 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. హసరంగ (3.2-0-9-6) మాయాజాలం ధాటికి 17.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా క్యాండీ టీమ్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. రేపు (ఆగస్ట్ 19) జరుగబోయే క్వాలిఫయర్-2లో క్యాండీ టీమ్.. గాలే టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. క్యాండీ చేతిలో ఓటమిపాలైన జాఫ్నా లీగ్ నుంచి నిష్క్రమించింది. కాగా, ఈ మ్యాచ్‌లో హసరంగ నమోదు చేసిన గణాంకాలు (6/9) లంక ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. For King Babar, reaching the top was easy. Staying there seems easier! Be part of the LPL playoffs action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIsdLx#LPL2023 #LiveTheAction pic.twitter.com/wKS7BGZ0VV — LPL - Lanka Premier League (@LPLT20) August 18, 2023 బ్యాట్‌తోనూ చెలరేగిన హసరంగ.. జాఫ్నాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో క్యాండీ కెప్టెన్ హసరంగ బ్యాట్‌తోనూ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న హసరంగ 2 భారీ సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. ప్రస్తుత LPL సీజన్లో హసరంగ బంతితో పాటు బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన హసరంగ 17 వికెట్లు పడగొట్టడంతో పాటు 8 ఇన్నింగ్స్‌ల్లో 231 పరుగులు చేసి, సీజన్ నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. It comes as no surprise, one of T20 most wanted, Wanindu is back on top! Be part of the LPL playoffs action. Get your tickets now! Book online via BookMyShow 👉https://t.co/leccAIsdLx#LPL2023 #LiveTheAction pic.twitter.com/wdZiJKvobN — LPL - Lanka Premier League (@LPLT20) August 18, 2023 ఫైనల్లో డంబుల్లా.. నిన్ననే జరిగిన క్వాలిఫయర్-1లో డంబుల్లా ఔరా.. గాలే టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ కాగా.. డంబుల్లా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్ పెరీరా (53) అర్ధసెంచరీతో రాణించి, డంబుల్లాను గెలిపించాడు. -
పిల్ల బచ్చాలను పంపమని మేమడిగామా..? టీమిండియాపై పాక్ కెప్టెన్ అతి వ్యాఖ్యలు
శ్రీలంక వేదికగా కొద్ది రోజుల కిందిట జరిగిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఏసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్-ఏ టీమ్.. యువ భారత జట్టుపై 128 పరుగుల తేడాతో గెలుపొంది, ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ గెలుపు తర్వాత కొందరు నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును విమర్శించడం మొదలుపెట్టారు. పాక్ సీనియర్ జట్టుతో (అనుభవం+వయసు) ఆసియా కప్ బరిలోకి దిగిందని, ఫైనల్లో ఓడిన భారత్ యువ జట్టుతో పోరాడిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపై తాజాగా పాక్-ఏ జట్టు కెప్టెన్ మహ్మద్ హరీస్ స్పందించాడు. తమ గెలుపును ఒప్పుకోని వారికి హరీస్ చురకలంటించాడు. అంతర్జాతీయ అనుభవం లేని యువ భారత జట్టును ఆసియా కప్‌కు పంపమని తాము బీసీసీఐని అడగలేదని, అనుభవజ్ఞులున్నారంటున్న తమ జట్టులో ఒకరిద్దరూ మాత్రమే 10 లోపు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారని కౌంటరిచ్చాడు. మాకు పదుల సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంటే, ఆసియా కప్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లకు వందల సంఖ్యలో (260 మ్యాచ్‌లు) ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది కదా అని ఎదురుదాడికి దిగాడు. పెద్ద వయసు వారిని బరిలోకి దించామని అంటున్నారు.. భారత్-ఏ టీయ్ యావరేజ్ వయసు 20.80 అయితే, పాక్-ఏ జట్టు సగటు వయసు 23.20 అని, వయసు రిత్యా ఇది పెద్ద తేడా కాదని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. వాస్తవానికి బీసీసీఐ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అనుభవం కూడా లేని యువ భారత జట్టును ఎమర్జింగ్ ఆసియా కప్‌కు పంపింది. అదే పాక్ మాత్రం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఏడుగురు ఆటగాళ్లను బరిలోకి దించింది. కెప్టెన్ సహా ఆ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు పాక్ టీ20 జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. ఎలాగైనా ఆసియా కప్ గెలవాలనే కుయుక్తితో పీసీబీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్ జట్టును బరిలోకి దించిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు యువకులతో కూడిన జట్టే అయినా భారత్ ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించింది. ఫైనల్ వరకు చేరింది. అయితే ఫైనల్లో కొన్ని తప్పిదాల కారణంగా పాక్‌కు మ్యాచ్ అప్పగించింది. కెప్టెన్ యశ్ ధుల్, సాయి సుదర్శన్, నికిన్ జోస్, నిషాంత్ సింధు, మానవ్ సుతార్, హర్షీత్ రాణా, హంగార్గేకర్ అద్భుతంగా రాణించారు. ఫైనల్లో తయ్యాబ్ తాహిర్ సెంచరీ చేయడంతో పాక్ 352 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన భారత్ 224 పరుగులకు ఆలౌటైంది. -
సూర్యకు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలికా?: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్
ACC Mens Emerging Teams Asia Cup 2023: మహ్మద్ హ్యారిస్.. పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. అరంగేట్రంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దూకుడైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. గతేడాది జూన్‌లో వెస్టిండీస్‌తో వన్డే సందర్భంగా పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ పెషావర్ వికెట్ కీపర్ బ్యాటర్‌కు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా టీ20లలో ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ హ్యారిస్.. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఇక పాకిస్తాన్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 22 ఏళ్ల హ్యారిస్.. 5 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి.. వరుసగా 27, 126 పరుగులు సాధించాడు. కెప్టెన్‌గానూ ప్రస్తుతం అతడు ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023 టోర్నీలో పాక్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌తో మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. యూఏఈతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకం(55)తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ రెండు మ్యాచ్‌లలోనూ గెలుపొందిన పాకిస్తాన్.. భారత జట్టుతో సెమీ ఫైనల్‌కు సిద్ధమైంది. కాగా దూకుడైన ఆట కారణంగా చాలా మంది మహ్మద్ హ్యారిస్‌ను టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌తో పోలుస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓవరాక్షన్! పాక్ టీవీతో మాట్లాడుతూ.. ‘‘మా ఇద్దరి మధ్య పోలికలు అనవసరం. సూర్య వయస్సు 32-33 ఏళ్ల మధ్య ఉంటుంది. నేనింకా 22 ఏళ్ల కుర్రాడినే. సూర్య స్థాయికి చేరుకోవాలంటే నేనింకా ఎంతో కష్టపడాలి. సూర్య, ఏబీ డివిలియర్స్లది వేరే లెవల్. అయితే నాకంటూ ఓ గుర్తింపు కూడా ఉంది. 360 డిగ్రీ ప్లేయర్‌గా నాకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అంతేగానీ.. వాళ్ల పేర్లతో పోలిక సరికాదు’’ అని మహ్మద్ హ్యారిస్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియాతో జూలై 19న సెమీ ఫైనల్ నేపథ్యంలో అన్ని జట్లలాగే ఈ మ్యాచ్ కూడా ఉంటుందని పేర్కొన్నాడు. ఇక హ్యారిస్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ‘‘నీకు సూర్య, ఏబీడీతో పోలికేంటి? కరెక్ట్‌గా చెప్పావు.. నిజంగానే నువ్వు బచ్చాగాడివి..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: పాతికేళ్లకే ఇషాన్ ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడా! కోహ్లికి కూడా సాధ్యం కానివి.. టీమిండియాతో టీ20 సిరీస్.. వెస్టిండీస్‌కు గుడ్ న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు