సూర్యకుమార్ యాదవ్
ACC Mens Emerging Teams Asia Cup 2023: మహ్మద్ హ్యారిస్.. పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. అరంగేట్రంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దూకుడైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. గతేడాది జూన్‌లో వెస్టిండీస్‌తో వన్డే సందర్భంగా పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ పెషావర్ వికెట్ కీపర్ బ్యాటర్‌కు తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా టీ20లలో ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ హ్యారిస్.. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఇక పాకిస్తాన్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 22 ఏళ్ల హ్యారిస్.. 5 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి.. వరుసగా 27, 126 పరుగులు సాధించాడు.
కెప్టెన్‌గానూ
ప్రస్తుతం అతడు ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023 టోర్నీలో పాక్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌తో మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. యూఏఈతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకం(55)తో ఆకట్టుకున్నాడు.
ఇక ఈ రెండు మ్యాచ్‌లలోనూ గెలుపొందిన పాకిస్తాన్.. భారత జట్టుతో సెమీ ఫైనల్‌కు సిద్ధమైంది. కాగా దూకుడైన ఆట కారణంగా చాలా మంది మహ్మద్ హ్యారిస్‌ను టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌తో పోలుస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఓవరాక్షన్!
పాక్ టీవీతో మాట్లాడుతూ.. ‘‘మా ఇద్దరి మధ్య పోలికలు అనవసరం. సూర్య వయస్సు 32-33 ఏళ్ల మధ్య ఉంటుంది. నేనింకా 22 ఏళ్ల కుర్రాడినే. సూర్య స్థాయికి చేరుకోవాలంటే నేనింకా ఎంతో కష్టపడాలి.
సూర్య, ఏబీ డివిలియర్స్‌లది వేరే లెవల్. అయితే నాకంటూ ఓ గుర్తింపు కూడా ఉంది. 360 డిగ్రీ ప్లేయర్‌గా నాకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అంతేగానీ.. వాళ్ల పేర్లతో పోలిక సరికాదు’’ అని మహ్మద్ హ్యారిస్ వ్యాఖ్యానించాడు.
ఇక టీమిండియాతో జూలై 19న సెమీ ఫైనల్ నేపథ్యంలో అన్ని జట్లలాగే ఈ మ్యాచ్ కూడా ఉంటుందని పేర్కొన్నాడు. ఇక హ్యారిస్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ‘‘నీకు సూర్య, ఏబీడీతో పోలికేంటి? కరెక్ట్‌గా చెప్పావు.. నిజంగానే నువ్వు బచ్చాగాడివి..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: పాతికేళ్లకే ఇషాన్ ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడా! కోహ్లికి కూడా సాధ్యం కానివి..
టీమిండియాతో టీ20 సిరీస్.. వెస్టిండీస్‌కు గుడ్ న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment