పాకిస్తాన్ క్రికెటర్లందరూ ప్రస్తుతం ఛాంపియన్స్ వన్డే కప్‌లో బీజీబీజీగా ఉన్నారు. కెప్టెన్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఈ టోర్నమెంట్‌లో భాగమయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జాతీయ జట్టును పటిష్టం చేసేందుకు చాంపియన్స్ వన్డే కప్‌తో పాటు చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట మూడు టోర్నీలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.
అందులో భాగంగానే తొలుత ఛాంపియన్స్ వన్డే కప్‌ను పీసీబీ నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో మార్ఖోర్స్, స్టాలియన్స్, పాంథర్స్, డాల్ఫిన్స్, లయన్స్ పేరిట ఐదు జట్లు పాల్గోంటున్నాయి. మార్ఖోర్స్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహిస్తుండగా.. స్టాలియన్స్‌కు మహ్మద్ హ్యారిస్, పాథర్స్‌కు షాదాబ్ ఖాన్, డాల్ఫిన్స్‌కు సౌద్ షకీల్, లయన్స్‌కు షాహీన్ షా అఫ్రిది కెప్టెన్‌లుగా ఉన్నారు.
హ్యారిస్‌పై ట్రోల్స్ వర్షం..
కాగా టోర్నీలో భాగంగా సోమవారం మార్కోర్స్‌తో స్టాలియన్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టాలియన్స్ 105 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ అనంతరం స్టాలియన్స్ కెప్టెన్ మహ్మద్ హారిస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోయినందుకు సంతోషంగా ఉందని చెప్పడంతో హ్యారీస్‌ను అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
మేము ఈ మ్యాచ్‌లో ఎటువంటి తప్పిదాలు చేయలేం. మా జట్టు బలాలు, బలహీనతలను పరీక్షించుకున్నాము. గత మ్యాచ్‌లో మేము టాస్ గెలిచి తొలుత మా బ్యాటింగ్ బలాన్ని చెక్ చేశాము. ఆ మ్యాచ్‌లో కూడా ఓడి పోయాము. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మా బౌలింగ్ యూనిట్ బలాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాము.
కానీ ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి చూశాం. మా బలాలు, బలహీనతలు ఎంటో తెలుసుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి అంటూ హ్యారీస్ పేర్కొన్నాడు. దీంతో హ్యారీస్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
చదవండి: SL vs NZ: కివీస్‌తో తొలి టెస్టు.. శ్రీలంక తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment