IPL 2022: సునీల్ న‌రైన్ ఊచ‌కోత‌.. సంబురాల్లో కేకేఆర్‌ | Sunil Narine Hits Blistering Fifty In Bangladesh Premier League 2022 Final | Sakshi
Sakshi News home page

BPL 2022 Final: సునీల్ న‌రైన్ ఊచ‌కోత‌.. సంబురాల్లో కేకేఆర్‌

Published Sat, Feb 19 2022 4:07 PM | Last Updated on Sat, Feb 19 2022 4:09 PM

Sunil Narine Hits Blistering Fifty In Bangladesh Premier League 2022 Final - Sakshi

Sunil Narine: వెస్టిండీస్ ఆట‌గాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయ‌ర్‌ సునీల్‌ నరైన్ భీక‌ర‌మైన  ఫామ్‌లో కొన‌సాగుతున్నాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్ 2022)లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఈ విండీస్ ఆల్‌రౌండ‌ర్‌ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి బ్యాటింగ్ చేస్తున్నాడు. 


లీగ్‌లో భాగంగా బుధవారం చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో జరిగిన  సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో విధ్వంసక‌ర ఇన్నింగ్స్ (57 పరుగులు) ఆడిన న‌రైన్‌.. శుక్ర‌వారం ఫార్చూన్ బారిషల్‌తో జ‌రిగిన ఫైన‌ల్లోనూ అదే త‌ర‌హాలో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. ఫ‌లితంగా అత‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొమిల్లా విక్టోరియన్స్ జ‌ట్టు బీపీఎల్ 2022 ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించింది.


ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ‌రిలోకి దిగిన న‌రైన్‌ 23 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 ప‌రుగులు స్కోర్ చేశాడు. దొరికిన బంతిని దొరిక‌న‌ట్లు బాధ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న అత‌ను.. లీగ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. 
చ‌ద‌వండి: 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ.. 6 సిక్స్‌లు.. 5 ఫోర్లు.. యూవీ రికార్డు జస్ట్‌ మిస్‌!


ఫ‌లితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన కొమిల్లా జ‌ట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంత‌రం ఛేద‌న‌లో ఫార్చూన్‌ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఒక్క ప‌రుగు తేడాతో ఓటమిపాలైంది. 


ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు నరైన్ భీక‌ర‌మైన‌ ఫామ్ ఉండ‌టంతో కేకేఆర్ ఫ్రాంచైజీ సంబురాల్లో మునిగి తేలుతుంది. ఈ ఏడాది మెగా వేలానికి ముందు కేకేఆర్ అత‌న్ని 6 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.


చ‌ద‌వండి: IPL 2022: రూ.100 కోట్లతో సునీల్‌ నరైన్‌ సరికొత్త రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement