west indies all rounder
-
Odean Smith: ఓ మ్యాచ్‌లో విలన్‌గా, రెండు మ్యాచ్‌ల్లో హీరోగా..!
IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన హైఓల్టేజీ పోరులో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ ఓటమితో ముంబై ప్రస్తుత సీజన్లో వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుని, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రోహిత్ సేనను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటిన మయాంక్ సేన.. ప్రత్యర్థికి 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం పంజాబ్ ప్లేయర్లు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ ప్రతాపం చూపి, ముంబై ఇండియన్స్‌ను 186 పరుగులకే కట్టడి చేశారు. పంజాబ్ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలి ఇద్దరు (తిలక్ వర్మ, పోలార్డ్) కీలక ప్లేయర్లను రనౌట్ చేయగా, బౌలింగ్‌లో ఓడియన్ స్మిత్ విశ్వరూపాన్ని ప్రదర్శించి చివరి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై గెలుపుకు 6 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన దశలో బంతిని అందుకున్న స్మిత్.. అద్భుతమైన బంతులు సంధించి ముంబై లోయరార్డర్‌ను కకావికలం చేశాడు. ఈ మ్యాచ్‌లో బంతితో రాణించి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్మిత్.. తన తొలి ఐపీఎల్ సీజన్లోనే మిశ్రమ అనుభవాలను రుచి చూశాడు. ఆర్సీబీతో జరిగిన తన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విశ్వరూపం (8 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) చూపి పంజాబ్‌ను గెలిపించిన స్మిత్.. కేకేఆర్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లో బంతితో ఘోరంగా విఫలమై, జట్టు ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఆ మ్యాచ్‌లో రసెల్ విధ్వంసం ధాటికి బలైన స్మిత్.. ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకుని పంజాబ్ అభిమానుల దృష్టిలో విలనయ్యాడు. అయితే తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తిరిగి గాడిలో పడిన అతను.. విలన్ ఇమేజ్ నుంచి బయటపడి హీరో ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. చదవండి: దటీజ్ జానియర్ 'ఏబీ'.. ఐపీఎల్ 2022లోనే భారీ సిక్సర్.. వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: సునీల్ నరైన్ ఊచకోత.. సంబురాల్లో కేకేఆర్
Sunil Narine: వెస్టిండీస్ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ భీకరమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ ఆల్‌రౌండర్ ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు. లీగ్‌లో భాగంగా బుధవారం చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ (57 పరుగులు) ఆడిన నరైన్.. శుక్రవారం ఫార్చూన్ బారిషల్‌తో జరిగిన ఫైనల్లోనూ అదే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కొమిల్లా విక్టోరియన్స్ జట్టు బీపీఎల్ 2022 ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నరైన్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 పరుగులు స్కోర్ చేశాడు. దొరికిన బంతిని దొరికనట్లు బాధడమే పనిగా పెట్టుకున్న అతను.. లీగ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. చదవండి: 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ.. 6 సిక్స్‌లు.. 5 ఫోర్లు.. యూవీ రికార్డు జస్ట్ మిస్! ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన కొమిల్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఫార్చూన్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు నరైన్ భీకరమైన ఫామ్ ఉండటంతో కేకేఆర్ ఫ్రాంచైజీ సంబురాల్లో మునిగి తేలుతుంది. ఈ ఏడాది మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 5️⃣ 1️⃣ runs in just 2️⃣ 1️⃣ balls! We love to see it! 😍 The ball has been bouncing off #SunilNarine’s bat and landing in the stands. 📺 Watch the action LIVE from the final of #BBPL2022 on #Fancode 👉 https://t.co/kIiCjX0tXl#BPLonFanCode pic.twitter.com/oBCCUU4aWS — FanCode (@FanCode) February 18, 2022 చదవండి: IPL 2022: రూ.100 కోట్లతో సునీల్ నరైన్ సరికొత్త రికార్డు -
బ్రేవో వీడ్కోలు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టి20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు చిర పరిచితమైన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అయితే, టి20 లీగ్‌లు మాత్రం ఆడతానని తెలిపాడు. 35 ఏళ్ల బ్రావో... 2004లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టు ద్వారా వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌పై జార్జిటౌన్లో తొలి వన్డే ఆడాడు. 40 టెస్టుల్లో 2,200 పరుగులు చేసి, 86 వికెట్లు పడగొట్టాడు. 164 వన్డేల్లో 2,968 పరుగులు, 199 వికెట్లు తీశాడు. టి20ల్లో మరింత ప్రభావవంతుడైన ఈ ఆల్‌రౌండర్ 2012, 2016 టి 20 ప్రపంచ కప్ నెగ్గిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడు. ఈ ఫార్మాట్లో 66 మ్యాచ్‌ల్లో 1,142 పరుగులు చేసి, 52 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. కెరీర్ అలా ముగిసింది: బ్రావో టెస్టు కెరీర్ 2010లోనే ముగిసింది. 2014లో భారత్‌లో పర్యటించిన విండీస్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బ్రావోకు ఆ సిరీసే చివరిదైంది. బోర్డుతో వివాదాల నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ధర్మశాలలో జరిగిన నాలుగో వన్డేలో టాస్ వేసేందుకు జట్టంతటినీ మైదానంలోకి తీసుకొచ్చి సంచలనం రేపాడు. తర్వాత విండీస్ జట్టు చివరిదైన ఐదో వన్డే, ఏకైక టి20, మూడు టెస్టులు ఆడకుండానే స్వదేశం వెళ్లిపోయింది. దీంతో ధర్మశాల మ్యాచ్‌తోనే ఆల్‌రౌండర్ వన్డే కెరీర్ ముగిసినట్లైంది. 2016లో అబుదాబిలో పాకిస్తాన్‌తో చివరి టి20 ఆడిన బ్రావో... ప్రస్తుతం విండీస్ దీవులతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్లలో నిర్వహించే టి20 లీగ్‌లలో పాల్గొంటున్నాడు. మారిన పరిణామాలతో దేశం తరఫున 2019 వన్డే ప్రపంచ కప్ ఆడతాడని భావించారు. కానీ, అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. -
అంపైర్‌ను తిట్టినందుకు ఆల్‌రౌండర్‌పై ఏడేళ్ల నిషేధం
తనను ఎల్బీడబ్ల్యుగా ప్రకటించినందుకు కోపంతో వికెట్లను బ్యాటుతో కొట్టి, అంపైర్‌ను తిట్టినందుకు ఆల్‌రౌండర్ కెవన్ ఫబ్లర్పై బెర్ముడా క్రికెట్ బోర్డు ఏడేళ్ల నిషేధం విధించింది. ఫబ్లర్పై లెవెల్ 4 నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపణలు రావడంతో... అతడు క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరయ్యాడు. సీ బ్రీజ్ ఓవల్ మైదానంలో బెయిలీస్ బే జట్టుపై విల్లో కట్స్ క్లబ్ తరఫున ఆడుతున్నప్పుడు అతడిలా చేశాడు. అయితే.. అలా ప్రవర్తించినా కూడా ఫబ్లర్ ఆ గేమ్‌లో ఆట కొనసాగించాడు. 6.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దాంతో బెయిలీస్ బే జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. నిజానికి ఫబ్లర్ను కాస్త చిన్నపాటి శిక్షతోనే సరిపెట్టేవాళ్లు. కానీ అతడు ఔటైన తర్వాత మైదానం వదిలిపెట్టి వెళ్లేటపుడు అంపైర్ కాల్ వాల్డ్రన్ మీద బాల్ విసిరాడు. దాంతో క్రమశిక్షణ సంఘం దాన్ని తీవ్రంగా పరిగణించి ఏడేళ్ల నిషేధం విధించింది. ఇంతకుముందు 2011లో కూడా ఫబ్లర్ ఒకసారి సోమర్సెట్ క్రికెట్ క్లబ్ నుంచి నిషేధానికి గురయ్యాడు. సెలెక్టర్ మొల్లీ సిమన్స్‌ను అతడు తిట్టాడు. ఇలా పదే పదే క్రమశిక్షణను ఉల్లంఘించడంతో ఈ యువ క్రికెటర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని సీనియర్లు అంటున్నారు.