అంపైర్‌ను తిట్టినందుకు ఆల్‌రౌండర్‌పై ఏడేళ్ల నిషేధం | West Indian all-rounder banned for seven years | Sakshi
Sakshi News home page

అంపైర్‌ను తిట్టినందుకు ఆల్‌రౌండర్‌పై ఏడేళ్ల నిషేధం

Published Wed, Jun 8 2016 2:36 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

అంపైర్‌ను తిట్టినందుకు ఆల్‌రౌండర్‌పై ఏడేళ్ల నిషేధం

అంపైర్‌ను తిట్టినందుకు ఆల్‌రౌండర్‌పై ఏడేళ్ల నిషేధం

తనను ఎల్బీడబ్ల్యుగా ప్రకటించినందుకు కోపంతో వికెట్లను బ్యాటుతో కొట్టి, అంపైర్‌ను తిట్టినందుకు ఆల్‌రౌండర్ కెవన్ ఫబ్లర్‌పై బెర్ముడా క్రికెట్ బోర్డు ఏడేళ్ల నిషేధం విధించింది. ఫబ్లర్‌పై లెవెల్ 4 నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపణలు రావడంతో... అతడు క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరయ్యాడు. సీ బ్రీజ్ ఓవల్‌ మైదానంలో బెయిలీస్‌ బే జట్టుపై విల్లో కట్స్ క్లబ్ తరఫున ఆడుతున్నప్పుడు అతడిలా చేశాడు. అయితే.. అలా ప్రవర్తించినా కూడా ఫబ్లర్ ఆ గేమ్‌లో ఆట కొనసాగించాడు. 6.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దాంతో బెయిలీస్‌ బే జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

నిజానికి ఫబ్లర్‌ను కాస్త చిన్నపాటి శిక్షతోనే సరిపెట్టేవాళ్లు. కానీ అతడు ఔటైన తర్వాత మైదానం వదిలిపెట్టి వెళ్లేటపుడు అంపైర్ కాల్ వాల్డ్రన్ మీద బాల్ విసిరాడు. దాంతో క్రమశిక్షణ సంఘం దాన్ని తీవ్రంగా పరిగణించి ఏడేళ్ల నిషేధం విధించింది. ఇంతకుముందు 2011లో కూడా ఫబ్లర్ ఒకసారి సోమర్‌సెట్ క్రికెట్ క్లబ్ నుంచి నిషేధానికి గురయ్యాడు. సెలెక్టర్ మొల్లీ సిమన్స్‌ను అతడు తిట్టాడు. ఇలా పదే పదే క్రమశిక్షణను ఉల్లంఘించడంతో ఈ యువ క్రికెటర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని సీనియర్లు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement