ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ బౌలర్లను జాక్స్ ఊచకోత కోశాడు.
ఈ క్రమంలో కేవలం 41 బంతుల్లోనే జాక్స్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జాక్స్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న జాక్స్.. 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 పరుగులతో ఆజేయంగా నిలిచింది. జాక్స్ విధ్వంసం ఫలితంగా 201 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 16 ఓవర్లలో ఊదిపడేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో జాక్స్‌తో పాటు కోహ్లి(70 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక మ్యాచ్‌లో సెంచరీ మెరిసిన జాక్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా జాక్స్ నిలిచాడు.
ఈ జాబితాలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తొలి స్ధానంలో ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ తరపున గేల్.. పుణే వారియర్స్‌పై కేవలం 30 బంతుల్లోనే గేల్ శతకం సాధించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో యూసఫ్ పఠాన్(37 బంతులు ), డేవిడ్ మిల్లర్(38 బంతులు ), ట్రవిస్ హెడ్(39 బంతులు ), విల్‌జాక్స్(41 బంతులు ) ఉన్నారు. అదే విధంగా ఆర్సీబీ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా జాక్స్ రికార్డులకెక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment