ఐపీఎల్-2023 సీజన్‌కు ఆరంభానికి ముందు రాయల్ ఛాలంజర్స్ బెంగళూరుకు మరో బిగ్ షాక్ తగిలింది. వేలంలో రూ.3.2 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లీష్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ జాక్స్.. సిరీస్ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అతడు ఐపీఎల్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు.
ఆర్సీబీలోకి మైఖేల్ బ్రేస్‌వెల్..
ఇక విల్ జాక్స్ స్థానాన్ని న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌తో భర్తీ చేయాలని ఆర్సీబీ మెనెజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రేస్‌వెల్‌తో ఆర్సీబీ సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కాగా బ్రెస్‌వెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో కివీస్ భారత పర్యటనలో భాగంగా బ్రేస్‌వెల్ అద్భుతంగా రాణించాడు.
హైదరాబాద్ వేదికగా టీమిండియా జరిగిన తొలి వన్డేలో బ్రెస్‌వెల్.. కేవలం 78 బంతుల్లోనే 140 పరుగులు సాధించి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అదే విధంగా బంతితో కూడా బ్రెస్‌వెల్ అకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బ్రేస్‌వెల్‌పై ఆర్సీబీ కన్నేసింది. కాగా మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఫీల్డింగ్ కోచ్‌గా మారిన ద్రవిడ్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment