ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్ సాహా (5), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
గుజరాత్ ఇన్నింగ్స్ విశేషాలు..
7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.
ఈ సీజన్‌లో సాయి సుదర్శన్ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
షారుక్ ఖాన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment