గుజరాత్ టైటన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సాయిసుదర్శన్ సెంచరీతో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సుదర్శన్ సీఎస్‌కే బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్‌ను బోర్డును పరుగులు పెట్టించాడు. గిల్, సుదర్శన్ కలిసి తొలి వికెట్ కు 210 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్(104) కూడా సెంచరీ చేశాడు.
సచిన్ రికార్డు బద్దలు..
ఇక మ్యాచ్‌లో సుదర్శన్ సెంచరీతో పాటు.. ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు.
సాయి సుదర్శన్ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉండేది.
సచిన్, గైక్వాడ్ ఇద్దరూ 1000 పరుగుల మైలు రాయిని 31 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌తో వీరిద్దరి ఆల్‌టైమ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైల్‌స్టోన్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ క్రికెటర్ షాన్ మార్ష్ (21) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాత విండీస్ ఆటగాడు లెండిల్ సిమన్స్(23) సిమ్మన్స్ ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment