ఐపీఎల్‌లో వరుస వైఫల్యాల తర్వాత శారీరకంగా, మానసికంగా కూడా విరామం అవసరమని తాను భావించానని...అందుకే తుది జట్టు నుంచి తనను తప్పించాలని తానే కోరినట్లు ఆర్‌సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ వివరణ ఇచ్చాడు. ముంబైతో మ్యాచ్‌లో వేలికి గాయం కాగా, అదే కారణంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ను ఆడించలేదని వినిపించగా... అదేమీ కారణం కాదని అతనే చెప్పాడు.
‘నేను తీసుకుంది సులువైన నిర్ణయం. కెప్టెన్, కోచ్‌ల వద్దకు వెళ్లి నా స్థానంలో మరొకరిని ప్రయత్నించేందుకు ఇది సరైన సమయమని చెప్పా. ప్రస్తుతం నాకు శారీరకంగా, మానసికంగా విరామం తప్పనిసరి అనిపించింది. అన్ని విధాలా కోలుకున్న తర్వాత మళ్లీ వచ్చి మెరుగైన ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నా’ అని మ్యాక్స్‌వెల్ చెప్పాడు.
ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 5.33 సగటుతో 32 పరుగులే చేశాడు. ఇందులో 3 సార్లు డకౌట్ కాగా, ఒక్కటే మ్యాచ్‌లో ఐదుకంటే ఎక్కువ బంతులు ఆడాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో రెండు సార్లు క్యాచ్ జారవిడిస్తే 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment