Oval
-
WTC Final: విజేత ఆసీస్.. భారత్‌పై 209 పరుగుల తేడాతో విజయం
టీమిండియా ఆలౌట్.. 209 పరుగుల తేడాతో ఆసీస్ విజయం డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ జట్టు 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 444 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదోరోజు లంచ్ సెషన్‌లోపే 234 పరుగులకే కుప్పకూలింది. 161/3 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు కోహ్లి రూపంలో కాసేపటికే షాక్ తగిలింది. ఆ వెంటనే జడేజా కూడా డకౌట్ కావడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. అయితే రహానే, శార్దూల్‌లు తొలి ఇన్నింగ్స్‌లో లాగా ఏదైనా అద్బుతం చేసి డ్రా దిశగా నడిపిస్తారేమోనని ఆశించారు. కానీ ఆసీస్ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. రహానే, శార్దూల్‌లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో.. టెయిలెండర్డను ఔట్ చేయడం ఎంతో సేపు పట్టలేదు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, కమిన్స్ ఒక వికెట్ తీశాడు. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 469& 270/8 టీమిండియా: 296 ఆలౌట్& 234 ఆలౌట్ ఫలితం: 209 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్‌గా అవతరించింది. ఓటమికి రెండు వికెట్ల దూరంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి మరింత దగ్గరైంది. ప్రధాన బ్యాటర్లంతా ఇప్పటికే వెనుదిరగడంతో ఆసీస్ బౌలర్లు టెయిలెండర్ల వికెట్లు తీసే పనిలో పడ్డారు. మిచెల్ స్టార్క్ ఉమేశ్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా టీమిండియా 220 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ► తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో శార్దూల్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ విజయం సాధించడం తథ్యం. రహానే(46) ఔట్.. ఆరో వికెట్ డౌన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ మాదిరి ఆదుకుంటాడనుకున్న రహానే(46) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 212 పరుగుల వద్ద ఆరో వికెట్ నష్టపోయింది. మరో 232 పరుగులు చేయాల్సిన టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. జడేజా డకౌట్.. ఐదో వికెట్ డౌన్ ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. కోహ్లి ఔటైన రెండు బంతుల వ్యవధిలోనే జడేజా కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కోహ్లి(49)ఔట్.. టీమిండియా 179/4 భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కోహ్లి రూపంలో షాక్ తగిలింది. 49 పరుగులు చేసిన కోహ్లి స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 179 పరుగులు వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. కాగా భారత్ విజయానికి ఇంకా 265 పరుగులు చేయాల్సి ఉంది. ఐదోరోజు మొదలైన ఆట.. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆట ఆఖరి రోజుకు చేరుకుంది. క్రితం రోజు స్కోరు ఆటను ఆరంభించిన టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కోహ్లి 46, రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. చేయాల్సినవి 280 పరుగులు.. చేతిలో ఉన్నవి ఏడు వికెట్లు. మరి టీమిండియా 444 పరుగుల టార్గెట్‌ను చేధించి చరిత్ర సృష్టిస్తుందా లేక డ్రాకు మొగ్గుచూపుతుందా అనేది చూడాలి. -
ఓవల్‌లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది. నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ జంట మెరిసింది. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా ) ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పరిణీతి, రాఘవ చద్దా ఓవల్‌లో వాలిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?) View this post on Instagram A post shared by 😍 PARINEETI ADDICTED 😍 (@parineetigalaxy) -
#NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. 444 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు గిల్, రోహిత్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. టీ విరామానికి ఒక్క ఓవర్ ముందు టీమిండియాకు ఊహించని దెబ్బ తగలిగింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్ ఆడే యత్నంలో శుబ్‌మన్ గిల్ స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే గిల్ ఔట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్‌లో చెప్పి బిగ్ స్ర్కీన్‌పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం గిల్‌తో పాటు కెప్టెన్ రోహిత్‌ను ఆశ్చర్యపరిచింది. అభిమానులు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేశారు. ''థర్డ్ అంపైర్ ఆసీస్ పక్షపాతిలా ఉన్నాడు.. అందుకే నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా ఔట్ ఇచ్చాడు.. కళ్లకు గంతలు కట్టుకొని తన నిర్ణయాన్ని వెల్లడించాడు.. RIP థర్డ్ అంపైర్'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) Cheating is in Blood of Australians and ICC. ICC is a slave of white skinned dominance. #WTCFinal#WTCFinal2023 Ponting Cameroon Green Gill pic.twitter.com/zlWAgob6zN — Ayush Jain (@aestheticayush6) June 10, 2023 చదవండి: WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప! -
WTC Final: చేతిలో ఏడు వికెట్లు.. భారత్ విజయానికి 280 పరుగులు
ముగిసిన ఆట.. చేతిలో ఏడు వికెట్లు; విజయానికి 280 పరుగుల దూరంలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 44, రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 444 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు చేతిలో ఏడు వికెట్లు ఉండగా.. చేయాల్సిన పరుగులు 280. చివరి రోజు మొత్తం నిలబడితే మాత్రం టీమిండియాకు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తే మాత్రం ఓటమి ముప్పు పొంచి ఉంది. ఏది ఏమైనా క్రీజులో కుదురుకున్న కోహ్లి, రహానేలు ఆదివారం తొలి సెషన్లో ఆడబోయే ఆటతో టీమిండియా కథ తేలిపోనుంది. పరిస్థితి ఏ మాత్రం ప్రతికూలంగా మారినా టీమిండియా మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం మేలు. 444 పరుగుల టార్గెట్‌ను చేధించి చరిత్ర సృష్టిస్తుందా లేక వికెట్లు పోగొట్టుకొని డ్రా లేదా ఓటమిని మూగట్టకుంటుందా అనేది చూడాలి. నిలకడగా ఆడుతున్న కోహ్లి, రహానే.. టీమిండియా 136/3 444 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 33 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కోహ్లి 30, రహానే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. పూజారా(27) ఔట్.. మూడో వికెట్ డౌన్ రోహిత్ ఇలా ఔటయ్యాడో లేదు నేను కూడా అంటూ పుజారా పెవిలియన్ చేరాడు. ఒకే ఓవర్లో కమిన్స్ రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. 27 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 92 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయి కష్టాల్లో పడింది. ఇక బారం అంతా కోహ్లి, రహానేలపైనే ఉంది. రోహిత్ శర్మ(43)ఔట్.. రెండో వికెట్ డౌన్ రోహిత్ శర్మ(43) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ లియోన్ బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా 352 పరుగుల దూరంలో ఉంది. నిలకడగా ఆడుతున్న రోహిత్.. టీమిండియా 66/1 టీ విరామం అనంతరం చివరి సెషన్ ఆడుతున్న టీమిండియా 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 33 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. అతనికి పుజారా నుంచి చక్కని సహకారం అందుకుంది. టీమిండియా విజయానికి 378 పరుగులు అవసరం ఉంది. టీ విరామం.. తొలి వికెట్ పడింది.. గిల్(18) ఔట్ 444 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కామెరాన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే స్లిప్‌లో ఉన్న గ్రీన్ బంతి కింద పెట్టినట్లు అల్ట్రాఎడ్జ్‌లో కనిపించింది. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అంపైర్ ఔటిచ్చాడు. వికెట్ నష్టానికి 41 పరుగులతో టీమిండియా టీ విరామానికి వెళ్లింది. టార్గెట్ 444.. టీమిండియా 4 ఓవర్లలో 23/0 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 14, శుబ్‌మన్ గిల్ 9 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్.. టీమిండియా టార్గెట్ 444 డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు 137 ఓవర్లలో 444 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అలెక్స్ కేరీ 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లబుషేన్ 41, మిచెల్ స్టార్క్ 41 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 433 పరుగుల ఆధిక్యంలో మిచెల్ స్టార్క్(41) రూపంలో ఆస్ట్రేలియా 260 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 433 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. టీమిండియాకు 450 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించే అవకాశం ఉంది. 400 దాటిన ఆసీస్ ఆధిక్యం లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో వేగం పెంచింది. ప్రస్తుతం 400 పరుగుల ఆధిక్యం దాటిన ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆడుతుంది. అలెక్స్ కేరీ 57 పరుగులు, మిచెల్ స్టార్క్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా విజయం కన్నా డ్రా దిశగా ఆడడం మేలు. లంచ్ విరామం.. 374 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 70 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ 41, మిచెల్ స్టార్క్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 374 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. 400 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచాలని ఆసీస్ భావిస్తుంది. తిప్పేసిన జడ్డూ.. ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 25 పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్‌ను జడేజా తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. లోటాస్గా వెళ్లిన బంతి గ్రీన్ బ్యాట్ హ్యాండిల్‌ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో ఆసీస్ 167 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. జడ్డూ స్పిన్ మాయాజాలానికి గ్రీన్ నోరెళ్లబెట్టాడు. ఇక ఆసీస్ 340 పరుగుల ఆధిక్యంలో ఉంది. 321 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ నాలుగో రోజు ఆటలో ఐదో వికెట్ త్వరగానే తీసినప్పటికి తర్వాతి వికెట్లు తీయడానికి టీమిండియా బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఇప్పటికే ఆసీస్ 321 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. లబుషేన్‌ను ఔట్ చేసిన ఉమేశ్.. ఐదో వికెట్ డౌన్ నాలుగోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ 41 పరుగులు చేసిన లబుషేన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. 297 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట మొదలైంది. మూడోరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన కంగారూలు దానిని కొనసాగిస్తూ ఓవరాల్ ఆధిక్యాన్ని దాదాపు మూడొందలకు చేర్చారు. మిగిలిన 6 వికెట్లతో ఆ జట్టు శనివారం ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. పిచ్ నెమ్మదిస్తుండటంతో ప్రస్తుతానికి ఇంకా మ్యాచ్ ఆ్రస్టేలియాతో చేతిలోనే ఉన్నట్లు! -
'ఎరుపు బంతి'.. ప్రాభవం కోల్పోతున్న దశ నుంచి శిఖరస్థాయికి
క్రికెట్ అంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు టి20 క్రికెట్. అయితే ఇదే టి20 క్రికెట్, వన్డే క్రికెట్‌కు మూలం సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్ అని మరిచిపోవద్దు. మనకు తెలిసి క్రికెట్ ప్రారంభమైంది దాదాపు మూడు వందల ఏళ్ల కిందటి పైమాటే. తొలుత బ్రిటీష్ వాళ్లు క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. 17,18వ దశకంలో ఇంగ్లండ్‌లో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. కాలక్రమంలో ఇంగ్లండ్ దేశం క్రికెట్‌కు పుట్టినిల్లుగా తయారైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. 18వ దశకం చివరి నుంచి 19వ దశకం ఆరంభం వరకు ఎక్కువ మ్యాచ్‌లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్యే జరిగేవి. అయితే మన దేశం బ్రిటీష్ వారి చేతుల్లో ఉండడంతో ఇక్కడ కూడా క్రికెట్‌పై ఆసక్తి బాగా ఉండేది. మన దేశం తరపున బ్రిటీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రికెట్‌పై ప్రజల్లో ఆసక్తి పెరగడం మొదలైంది. ఇక క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి టెస్టు క్రికెట్ ఫార్మాట్లోనే చాలాకాలం పాటు ఆట జరిగింది. 1975లో తొలి ప్రపంచకప్ జరిగే వరకు కూడా టెస్టు క్రికెట్ మాత్రమే ఎక్కువగా జరిగేది. మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికి 1980 తర్వాత హాకీ ప్రభావం కోల్పోవడం ప్రారంభమైంది. అదే సమయంలో క్రికెట్ మాత్రం వైభవం పెరుగుతూ వచ్చింది. 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కపిల్ డెవిల్స్ ప్రపంచకప్ విజేతగా నిలవడంతో క్రికెట్‌పై క్రేజ్ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. అక్కడి నుంచి టీమిండియా వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయ క్రీడ హాకీ నుంచి క్రికెట్ అనేలా మన ప్రాభవం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.1990వ దశకంలో క్రికెట్లో పెను మార్పులు వచ్చాయి. వన్డే మ్యాచ్‌లకు కలర్ జెర్సీలు వాడడం.. ఎర్రబంతుల స్థానంలో తెల్లబంతులు ఉపయోగించడం మొదలైంది. క్రమంగా వన్డే క్రికెట్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. వన్డే క్రికెట్‌కు ఆదరణ వచ్చినా టెస్టులకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే టి20 క్రికెట్ వచ్చాకా మాత్రం టెస్టులపై ఆసక్తి సన్నగిల్లింది. వన్డేలు ఒక్కరోజులో ముగిసిపోతే.. టి20లు మాత్రం మూడున్నర గంటల్లోనే ముగిసి అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటి ఆటగాళ్లలో ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్ కన్నా మూడు గంటల్లో ముగిసిపోయే టి 20 క్రికెట్ అంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడిందేమో అన్న సంకేతాలు వినిపించాయి. కానీ మనం ఒకటి అనుకుంటే ఐసీసీ మరోలా ఆలోచించింది. ప్రాభవం కోల్పోతున్న టెస్టు క్రికెట్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో కొత్త హంగులు తీసుకొచ్చింది. టెస్టు క్రికెట్ ఐదు రోజుల పాటు జరిగినప్పటికి అందులో ఉండే మజా వేరుగా ఉంటుంది. బ్యాటర్ల నుంచి కళాత్మక షాట్లు.. బౌలర్లు తీసే వికెట్లలో నైపుణ్యం కనిపిస్తుంటుంది. టి20ల్లో ఎంత వేగంగా ఆడినా.. బ్యాటింగ్‌లో నైపుణ్యం బయటపడేది టెస్టు క్రికెట్ ద్వారానే. ఇక స్పిన్నర్లు, పేసర్లు పోటీ పడి వికెట్లు తీస్తుంటే చూడముచ్చటగా ఉండేది. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లు కూడా దాదాపు మూడురోజుల్లోనే ముగిసిపోతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ మంచి టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగడమే దీనికి కారణం. టీమిండియా ఓటమిపాలైనప్పటికి డబ్ల్యూటీసీకి మాత్రం మంచి ఆదరణ లభించింది. దీన్నిబట్టి చూస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో టెస్టు క్రికెట్‌ను నిలబెట్టేందుకు ఐసీసీ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది. చదవండి: WTC Final: టెస్టుల్లో టీమిండియా తరపున సిక్సర్ల రారాజు ఎవరంటే? -
చిక్కడపల్లిలో అరుదైన పక్షి.. పతంగి మాంజాకు చిక్కుకుని..
సాక్షి, హైదరాబాద్: ఓ అరుదైన నార్త్ అమెరికా దేశానికి చెందిన ఓవల్ పక్షినీ నగర వాసులు కాపాడారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో ఓ అరుదైన పక్షి ప్రమాదవశాత్తు ఓ భారీ వృక్షానికి ఉన్న పతంగి మంజాకి చిక్కుకొని విలవిల్లాడింది. అటుగా వెళ్తున్న స్థానికులు దానిని గమనించి సురక్షితంగా కాపాడారు. చెట్టుకు వేలాడుతున్న పక్షిని కాపాడి దాహాన్ని తీర్చారు. చదవండి: వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే? వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. స్థానికులు రక్షించిన ఆ పక్షి నార్త్ అమెరికాకి చెందిన ఓ అరుదైన ఓవెల్‌గా గుర్తించారు. ఈ అరుదైన ఓవల్ పక్షిని చూసేందుకు స్థానికులు గుమిగూడారు. -
ఇంటిప్స్
పువ్వులు వాడిపోయినట్లనిపిస్తే వాటిని న్యూస్పేపర్లో చుట్టి రాత్రంతా నీళ్లలో వేస్తే ఉదయానికి తాజాగా మారతాయి.ఆకుకూరలు వండేటప్పుడు ముదురుగా ఉన్న కాడలను తీసి పారేస్తుంటాం. అలాగే కొత్తిమీరకు కూడా. వీటిని మొక్కలకు వేస్తే ఏపుగా పెరుగుతాయి. కోడిగుడ్డు పెంకులను పొడి చేసి మొక్కలకు వేస్తే త్వరగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. కూరగాయల మీద చల్లిన క్రిమిసంహారక మందులు పూర్తిగా పోవాలంటే... అరగంట సేపు ఉప్పు కలిపిన నీటిలో ఉంచి తర్వాత కడగాలి. -
బనానా మఫిన్స్
క్విక్ ఫుడ్ కావలసినవి మైదా పిండి – 2 కప్పులు, పంచదార – అర కప్పు, పాలు – 1 కప్పు, అరటిపండు గుజ్జు – 1 కప్పు, కోడిగుడ్డు – 1, జీడిపప్పు – 2 టీస్పూన్లు, బేకింగ్ పౌడర్ – చిటికెడు తయారి పాలు, కోడిగుడ్డు, అరటిపండు పంచదార బాగా గిలక్కొట్టాలి. కోడిగుడ్డు ఇష్టపడని వారు వేసుకోవద్దు. ఈ మిశ్రమానికి మైదా పిండి, బేకింగ్ పౌడర్ కూడా కలుపుకోవాలి. మఫిన్ బౌల్స్ తీసుకుని సగం వరకు ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి. పైన జీడిపప్పు పలుకులు చల్లుకోవాలి. అవెన్‌లో 15 – 20 నిమిషాల సేపు వుంచి తీసేయాలి. -
పట్టులాంటి జుట్టు కోసం...
బ్యూటిప్స్ ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి.తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు కదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా Ðð‡ురుస్తుంది. -
మూడో రోజే ధోనీసేన చిత్తుచిత్తు
లండన్: ఊహించినట్టే జరిగింది. టీమిండియా పోరాడకుండానే ఓటమిని అంగీకరించింది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో మూడో రోజే ధోనీసేన ఇన్నింగ్స్ 244 పరుగుల తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో ఇంగ్లీష్ జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఓ మ్యాచ్ డ్రాగా, మరో మ్యాచ్‌లో ధోనీసేన నెగ్గింది. చివరి మూడు టెస్టుల్లో కుక్‌సేన విజయం సాధించింది. ఐదో టెస్టులో మూడో రోజు ఆదివారం ఫాలోఆన్ ఆడిన టీమిండియా 94 పరుగులకే చాపచుట్టేసింది. జట్టులో బిన్నీ (25 నాటౌట్) టాప్ స్కోరర్. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్(2), గంభీర్ (3), పూజారా(11), కోహ్లీ (20), రహానే(4), ధోని(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంగ్లండ్ బౌలర్లు జోర్డాన్ నాలుగు, అండర్సన్ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 385/7 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 486 పరుగులు సాధించింది. దీంతో ఇంగ్లండ్ కు 338 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 148 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. -
ధోని డకౌట్: ఎదురీదుతున్నటీమిండియా
ఓవల్:ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో భారత్ ఎదురీదుతోంది. ఆదివారం మూడోరోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తొలి 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. కాసేపు ఫర్వాలేదనిపించింది. అయితే భారత్ స్కోరు బోర్డు 30 పరుగులు చేరే సరికి మూడో వికెట్టును కోల్పోయింది. అనంతరం మరో 16 పరుగులు జోడించి మరో రెండు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 46 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత్ ఓపెనర్లు మురళీ విజయ్(2), గంభీర్ (3)పరుగులకే పెవిలియన్ కు చేరగా, పూజారా(11), రహానే(4), పరుగుల వద్ద నిష్క్రమించారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(0) డకౌట్ గా వెనుదిరిగా భారత ఆశలపై నీళ్లు చల్లాడు.క్రీజ్ లో కోహ్లి(19), బిన్నీ(2) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్ సన్ కు రెండు వికెట్లు లభించగా,బ్రాడ్, వాక్స్ కు తలో వికెట్టు దక్కాయి. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 385 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మరో వంద పరుగులు పైగా జోడించి ఇన్నింగ్స్ ను 486 పరుగుల వద్ద ముగించింది. దీంతో ఇంగ్లండ్ కు 338 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఇంగ్లండ్ చివరి వరసు ఆటగాళ్లు జోర్డాన్ (20), బ్రాడ్(37) పరుగులు జోడించి జట్టు భారీ పరుగులు చేయడంలో తోడ్పడ్డారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 148 పరుగులకే చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. -
ఐదో టెస్టులో ఇంగ్లండ్ కు భారీ ఆధిక్యం
ఓవల్: భారత్ తో ఇక్కడ జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు ఏడు వికెట్లకు 385 పరుగులతో ఆదివారం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మరో వంద పరుగులకు పైగా జోడించి తొలి ఇన్నింగ్స్ ను 486 పరుగుల వద్ద ముగించింది. దీంతో ఇంగ్లండ్ కు 338 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఇంగ్లండ్ చివరి వరుస ఆటగాళ్లు జోర్డాన్ (20), బ్రాడ్(37) పరుగులు జోడించి జట్టు భారీ పరుగులు చేయడంలో తోడ్పడ్డారు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు దక్కగా, అశ్విన్ కు మూడు వికెట్లు, ఆరూన్ రెండు, భువనేశ్వర్ కుమార్ కు ఒక వికెట్టు లభించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్(149)పరుగులు చేసి మరో మారు ఆకట్టుకున్నాడు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 148 పరుగులకే చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించనున్న భారత్.. ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మరో రెండు రోజల పాటు ఆటను కొనసాగించాల్సి ఉంది. -
భారత్ 148 ఆలౌట్, ధోని ఒంటరిపోరాటం
ఓవల్: పటౌడీ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఓవల్ లో జరుగుతున్న ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 148 పరుగులకు ఆలౌటైంది. 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి దారుణమైన స్ఠితిలో ఉన్న భారత జట్టును ధోని తన బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. కెప్టెన్ ధోని ఒంటరి పోరాటంతో 82 పరుగులు చేశారు. ధోని 82 పరుగుల వద్ద అవుట్ కావడంతో భారత జట్టు 148 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. ధోని టెస్ట్ క్రికెట్ లో 4800 పరుగుల్నిపూర్తి చేసుకున్నాడు. భారత జట్టులో విజయ్(18), అశ్విన్(13), ధోని (82)లు తప్ప మిగితా ఆటగాళ్లు రెండెంకెల స్కోరును నమోదు చేసుకోలేకపోయారు. అండర్సన్, బ్రాడ్ రెండేసి వికెట్లు, జోర్డాన్, వోక్స్ మూడేసి వికెట్లు పడగొట్టారు.