ఇంటిప్స్
పువ్వులు వాడిపోయినట్లనిపిస్తే వాటిని న్యూస్‌పేపర్‌లో చుట్టి రాత్రంతా నీళ్లలో వేస్తే ఉదయానికి తాజాగా మారతాయి.ఆకుకూరలు వండేటప్పుడు ముదురుగా ఉన్న కాడలను తీసి పారేస్తుంటాం. అలాగే కొత్తిమీరకు కూడా. వీటిని మొక్కలకు వేస్తే ఏపుగా పెరుగుతాయి.
కోడిగుడ్డు పెంకులను పొడి చేసి మొక్కలకు వేస్తే త్వరగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. కూరగాయల మీద చల్లిన క్రిమిసంహారక మందులు పూర్తిగా పోవాలంటే... అరగంట సేపు ఉప్పు కలిపిన నీటిలో ఉంచి తర్వాత కడగాలి.