భారత్ 148 ఆలౌట్, ధోని ఒంటరిపోరాటం
ఓవల్: పటౌడీ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఓవల్ లో జరుగుతున్న ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 148 పరుగులకు ఆలౌటైంది. 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి దారుణమైన స్ఠితిలో ఉన్న భారత జట్టును ధోని తన బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. కెప్టెన్ ధోని ఒంటరి పోరాటంతో 82 పరుగులు చేశారు.
ధోని 82 పరుగుల వద్ద అవుట్ కావడంతో భారత జట్టు 148 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. ధోని టెస్ట్ క్రికెట్ లో 4800 పరుగుల్నిపూర్తి చేసుకున్నాడు. భారత జట్టులో విజయ్(18), అశ్విన్(13), ధోని (82)లు తప్ప మిగితా ఆటగాళ్లు రెండెంకెల స్కోరును నమోదు చేసుకోలేకపోయారు. అండర్సన్, బ్రాడ్ రెండేసి వికెట్లు, జోర్డాన్, వోక్స్ మూడేసి వికెట్లు పడగొట్టారు.