మూడో రోజే ధోనీసేన చిత్తుచిత్తు
లండన్: ఊహించినట్టే జరిగింది. టీమిండియా పోరాడకుండానే ఓటమిని అంగీకరించింది. ఇంగ్లండ్తో ఐదో టెస్టులో మూడో రోజే ధోనీసేన ఇన్నింగ్స్ 244 పరుగుల తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1తో ఇంగ్లీష్ జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో ఓ మ్యాచ్ డ్రాగా, మరో మ్యాచ్లో ధోనీసేన నెగ్గింది. చివరి మూడు టెస్టుల్లో కుక్సేన విజయం సాధించింది.
ఐదో టెస్టులో మూడో రోజు ఆదివారం ఫాలోఆన్ ఆడిన టీమిండియా 94 పరుగులకే చాపచుట్టేసింది. జట్టులో బిన్నీ (25 నాటౌట్) టాప్ స్కోరర్. టాపార్డర్ బ్యాట్స్మెన్ మురళీ విజయ్(2), గంభీర్ (3), పూజారా(11), కోహ్లీ (20), రహానే(4), ధోని(0) పెవిలియన్కు క్యూ కట్టారు. ఇంగ్లండ్ బౌలర్లు జోర్డాన్ నాలుగు, అండర్సన్ రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు 385/7 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 486 పరుగులు సాధించింది. దీంతో ఇంగ్లండ్ కు 338 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 148 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.