
బనానా మఫిన్స్
క్విక్ ఫుడ్
కావలసినవి మైదా పిండి – 2 కప్పులు, పంచదార – అర కప్పు, పాలు – 1 కప్పు, అరటిపండు గుజ్జు – 1 కప్పు, కోడిగుడ్డు – 1, జీడిపప్పు – 2 టీస్పూన్లు, బేకింగ్ పౌడర్ – చిటికెడు
తయారి పాలు, కోడిగుడ్డు, అరటిపండు పంచదార బాగా గిలక్కొట్టాలి. కోడిగుడ్డు ఇష్టపడని వారు వేసుకోవద్దు. ఈ మిశ్రమానికి మైదా పిండి, బేకింగ్ పౌడర్ కూడా కలుపుకోవాలి. మఫిన్ బౌల్స్ తీసుకుని సగం వరకు ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి. పైన జీడిపప్పు పలుకులు చల్లుకోవాలి. అవెన్‌లో 15 – 20 నిమిషాల సేపు వుంచి తీసేయాలి.