అంతర్జాతీయ క్రికెట్‌లో ఏదైనా మ్యాచ్‌కు సాధరణంగా ఇద్దరూ ఫీల్డ్ అంపైర్‌లతో పాటు ఓ థర్డ్ అంపైర్ కూడా బాధ్యతలు నిర్వరిస్తారు. ఈ విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలుసు. కానీ ఓ ఇంటర్ననేషనల్ సిరీస్ థర్డ్ అంపైర్ లేకుండానే జరుగుతోంది. అవును మీరు విన్నది నిజమే.
ఎడిన్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు థర్డ్ అంపైర్ ఎవరూ లేరు. థర్డ్ అంపైర్‌తో పాటు డీఆర్‌ఎస్ కూడా అందుబాటులో లేదు. థర్డ్ అంపైర్ అందుబాటులో లేకపోవడంతో రనౌట్, స్టంపౌట్‌లపై ఫీల్డ్ అంపైర్‌లదే తుది నిర్ణయం.
మూడో అంపైర్ లేకపోవడంతో రెండో టీ20లో ఆసీస్ బ్యాటర్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు కలిసొచ్చింది. మెక్‌గర్క్ స్టంపౌట్ ఔటైనప్పటకి ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించిడంతో మెక్‌గర్క్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
అయితే ఆస్ట్రేలియా వంటి వరల్డ్‌క్లాస్ జట్టు ఆడుతున్న సిరీస్‌కు థర్డ్ అంపైర్ లేకపోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయం సాధించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.
చదవండి: AUS vs SCO: జోష్ ఇంగ్లిస్ రికార్డు సెంచరీ.. ఆసీస్ సిరీస్ విజయం
Comments
Please login to add a commentAdd a comment