క్రికెట్‌ను మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా భావించే భారత దేశంలో అభిమానులు రకరకాలుగా ఉంటారు. వారు క్రికెట్ పట్ల తమకున్న అభిమానాన్ని, ఆసక్తిని వివిధ రకాలుగా చాటుకుంటుంటారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కొందరు యువకులు క్రికెట్‌పై అమితాసక్తితో ఓ వినూత్న ప్రయోగం చేశారు. వారు ప్రవహించే నదిలో సరదాగా క్రికెట్ ఆడారు. అంతర్జాతీయ మ్యాచ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని రూల్స్ పాటించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్ది రోజులుగా నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఈ వీడియోలో కొందరు యువకులు నీటిపై క్రికెట్ ఆడుతుంటారు. బౌలర్ వేసిన ఓ బంతిని బ్యాటర్ నీటిని చిమ్ముతూ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అది కాస్త మిస్ అయ్యి వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు ఫీల్డింగ్ జట్టు అంపైర్‌కు అప్పీల్ చేయగా, అతను నాటౌట్ అంటాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని బౌలింగ్ టీమ్.. రివ్యూ తీసుకుంటుంది. థర్డ్ అంపైర్ రీప్లేను అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీతో పరిశీలించి ఔట్‌గా ప్రకటిస్తాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాడు. ఈ తంతు మొత్తం అంతర్జాతీయ మ్యాచ్‌లో ఎలా సాగుతుందో అచ్చం అలాగే సాగింది. ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment