Virat Kohli's Controversial LBW Dismissal Causes Massive Social Media Uproar - Sakshi
Sakshi News home page

IND vs AUS: చెత్త అంపైరింగ్‌.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్‌.. నో అంటున్నా..

Published Sat, Feb 18 2023 2:09 PM | Last Updated on Sat, Feb 18 2023 3:29 PM

 Virat Kohlis Controversial LBW Dismissal Cause Massive Social Media Uproar - Sakshi

PC: Disney+Hotstar/Twitter

India vs Australia, 2nd Test- Virat Kohli: ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఔటైన తీరు వివాదస్పదమైంది. థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి కోహ్లి మరోసారి బలైపోయాడు. దీంతో టీమిండియా అభిమానులు అంపైర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఏం జరిగిందంటే?
భారత్‌ ఇన్నింగ్స్‌ 50 ఓవర్‌ వేసిన మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ కోహ్లి ప్యాడ్‌ను తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఆసీస్‌ ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్‌ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఔట్‌ అని వేలు పైకెత్తాడు.

అయితే అంపైర్ అవుట్‌గా ప్రకటించిన వెంటనే, విరాట్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో విరాట్ కోహ్లి బ్యాట్‌కి ముందుగా బాల్ తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అంపైర్‌ నిర్ణయాన్ని స్క్రీన్‌పై చూసిన కోహ్లి కూడా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు.

‘నో’ అంటూ తల ఊపుతూ కోహ్లి పెవిలియన్‌కు వెళ్లాడు.  ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ 44 పరగులు చేశాడు. కాగా విరాట్‌ కోహ్లి ఔట్‌ నిర్ణయంపై టీమిండియా మాజీ ఆటగాళ్లు అభినవ్‌ ముకుంద్‌, వసీం జాఫర్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. గతేడాది స్వదేశంలో శ్రీలంకపై కూడా విరాట్‌ ఇలానే పెవిలియన్‌కు చేరాడు.

‘‘ఢిల్లీ టెస్టులో కోహ్లిది కూడా నాటౌట్‌. బంతి ముందు బ్యాట్‌కు తాకింది. కోహ్లి చాలా  దురదృష్టవంతుడు. అతడి వికెట్‌తో భారత్‌ కష్టాల్లో పడింది’’ అని అభినవ్‌ ముకుంద్‌ ట్వీట్‌ చేశాడు. "అది ఔట్‌ కాదు. స్పష్టంగా బంతి బ్యాట్‌కు ముందు తాకింది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై చాలా సందేహాలు ఉన్నాయి’’ అని జాఫర్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక ఫ్యాన్స్‌ కూడా థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై మండిపడుతున్నారు.  "చెత్త అంపైరింగ్‌.. కళ్లు కనిపించడం లేదా! అది నాటౌట్‌’’ అంటూ విరాట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా ఫీల్డర్‌ అద్భుత విన్యాసం.. షాక్‌లో శ్రేయాస్! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement