న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వివాదాస్పద రీతిలో వెనుదిరగాల్సి వచ్చింది. థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం వల్ల వెనుదిరిగిన పాండ్యా అసలు ఔటా లేక నాటౌటా అన్న సందేహం తలెత్తక మానదు. డారిల్ మిచెల్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో నాలుగో బంతిని పాండ్యా ఫ్లిక్ చేయబోయి మిస్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో బంతి కీపర్ టామ్ లాథమ్ చేతుల్లో పడింది. ఆ వెంటనే బెయిల్స్ కూడా కిందపడ్డాయి. పాండ్యా ఔట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా బంతి ఎక్కడా నేరుగా వికెట్లను తాకిన దాఖలాలు కనిపించలేదు. అయితే టామ్ లాథమ్ గ్లోవ్స్ మాత్రం వికెట్లను తాకినట్లు కనిపించింది. అదే సమయంలో బంతి కూడా లాథమ్ చేతుల్లో పడింది. లాథమ్ బంతి అందుకోకముందే బెయిల్స్ ఎగురగొట్టినట్లు పరిగణించిన థర్డ్ అంపైర్ పాండ్యాను బౌల్డ్‌గా ప్రకటించి ఔట్ ఇచ్చాడు. అంతే కివీస్ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోగా.. ఆశ్చర్యపోవడం పాండ్యా వంతైంతి.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 46 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 168, శార్దూల్ ఠాకూర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గిల్‌కు ఇది వరుసగా రెండో వన్డే సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో వన్డేల్లో 18 ఇన్నింగ్స్‌ల్లోనే గిల్ వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
Out or Not Out?#IndvNz#HardikPandya𓃵 #notout pic.twitter.com/Hbzzwan4bs
— Rahul Sisodia (@Sisodia19Rahul) January 18, 2023
Comments
Please login to add a commentAdd a comment