
Courtesy: IPL Twitter
బ్యాటర్ నడుముకంటే ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చే ‘నోబాల్స్’ విషయంతో మూడో అంపైర్ జోక్యం చేసుకుంటే బాగుంటుందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. ఢిల్లీ, రాజస్తాన్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడటంతో ‘నోబాల్’ అంశం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ దశను మార్చే కీలక సమయాల్లో అంపైర్లు ఈ విషయాన్ని పరిశీలించమంటూ థర్డ్ అంపైర్ కోరటం సరైందని అతను సూచించాడు. జయవర్ధనే ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ‘నో బాల్’ వివాదంలో తమ బ్యాటర్లను మైదానం నుంచి వెనక్కి పిలిచే ప్రయత్నం చేసి క్రమశిక్షణను ఉల్లంఘించిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్య తీసుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా (సుమారు రూ. కోటీ 14 లక్షలు) విధించింది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై కూడా 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించిన కౌన్సిల్... శార్దూల్‌ను కూడా 50 శాతం జరిమానాతో శిక్షించింది.
చదవండి: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ..
Comments
Please login to add a commentAdd a comment