
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 325 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ప్రస్తుతం 149 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్ పట్టు బిగించేలా కనిపిస్తోంది.
ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీసుకుంటున్న పలు క్యాచ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గిల్ క్యాచ్‌ను గ్రీన్ అందుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం యాషెస్ సిరీస్‌లోనూ బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ మళ్లీ గ్రీన్ మరో వివాదాస్పద క్యాచ్‌తో వార్తల్లో నిలిచాడు. బెన్ డక్కెట్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో ఉన్న గ్రీన్ అందుకున్నాడు. అయితే బంతి నేలను తాకినట్లు క్లియర్‌గా ఉన్నా థర్డ్ అంపైర్ మరోసారి గ్రీన్‌కే ఓటు వేశాడు. ఈ రెండు సందర్భాల్లో గ్రీన్ విలన్‌గా మారితే.. తాజాగా స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్‌ల జాబితాలో చేరాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభం లభించింది. అయితే రూట్ (10 పరుగులు) ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్టార్క్ వేసిన బంతిని(46.3వ ఓవర్‌లో) రూట్ ఎదుర్కొనే క్రమంలో బ్యాక్‌వర్డ్ స్క్వేర్ వద్ద స్మిత్ చేతికి చిక్కాడు. అయితే క్యాచ్ అందుకున్న విధానంపై అనుమానంతో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. రిప్లేలో బంతి నేలను తాకుతుందని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి.. ఔట్ ఇవ్వడం ఏంటని ఇంగ్లండ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nine wickets ☝
— England Cricket (@englandcricket) June 30, 2023
Three hundred and thirty-five runs 🏏
Another day of Test match cricket to savour 👇 pic.twitter.com/48K4lXmk2J