The Ashes, 2023: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో విఫలమైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెండో మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో స్మిత్ వరుసగా 16, 6 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా 110 పరుగులు సాధించాడు. తద్వారా టెస్టు కెరీర్‌లో 32వ శతకం నమోదు చేసిన స్మిత్.. అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 44వ శతకం సాధించాడు.
రోహిత్ శర్మను వెనక్కినెట్టిన స్మిత్
తద్వారా టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మను అధిగమించాడు. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక దీనితో పాటు మరో రికార్డును కూడా స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆసీస్ తరఫున
టెస్టుల్లో అత్యధిక సెంచరీ వీరుల జాబితాలో ఆసీస్ తరఫున దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా(32 సెంచరీలు)తో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. సచిన్ టెండుల్కర్(51), జాక్ కలీస్(45), రికీ పాంటింగ్(41) ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. యాషెస్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌట్ అయింది.
416 పరుగులకు ఆలౌట్
ఓపెనర్ డేవిడ్ వార్నర్ 66 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన లబుషేన్ 47, ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ట్రవిస్ హెడ్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ 22, కెప్టెన్ కమిన్స్ 22 రన్స్ తీశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. రూట్ రెండు వికెట్లు పడగొట్టారు. స్టువర్ట్ బ్రాడ్, ఆండర్సన్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
ప్రస్తుత తరం క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్-5 బ్యాటర్లు
►విరాట్ కోహ్లి(భారత్)- 75
►జో రూట్(ఇంగ్లండ్)- 46
►డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- 45
►స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 44
►రోహిత్ శర్మ(భారత్)- 43.
చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం! వాళ్లకు ఊరటనిచ్చేలా.. ఇక ధావన్ కెప్టెన్‌గా..
🚨Steve Smith is the fastest batsman to score 32nd Hundreds in Test Cricket🚨#Ashes23 #ENGvAUS#ENGvsAUS #Ashespic.twitter.com/bKwZYRL5Ez
— Cricket Videos 🏏 (@Abdullah__Neaz) June 29, 2023
Comments
Please login to add a commentAdd a comment