ఫ్రీ హిట్‌కు క్యాచ్‌ పట్టి సెలబ్రేషన్స్‌.. పాక్‌ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్‌ | Usama Mir Celebrates After Taking Catch On Free Hit In Big Bash League, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

BBL 2023 Usama Mir Catch Video: ఫ్రీ హిట్‌కు క్యాచ్‌ పట్టి సెలబ్రేషన్స్‌.. పాక్‌ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్‌

Published Sun, Dec 24 2023 2:50 PM | Last Updated on Sun, Dec 24 2023 4:46 PM

Usama Mir celebrates after taking catch on free hit, video viral - Sakshi

బిగ్‌ బాష్‌ లీగ్‌-2023లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో  సిడ్నీ థండర్‌ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సిడ్నీ థండర్‌ తరపున ఆడుతున్న పాకిస్తాన్‌ ఆటగాడు ఉసామా మీర్‌ గ్రౌండ్‌లో నవ్వులు పూయించాడు.

ఏం జరిగిందంటే?
మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలి బంతి వేసే క్రమంలో బౌలర్‌ స్టిక్టీ ఓవర్‌ స్టాప్‌ చేశాడు. దీంతో మెల్‌బోర్న్‌ బ్యాటర్‌ బెన్‌క్రాప్ట్‌కు ఫ్రీహిట్‌ లభించింది. ఫ్రీహిట్‌ బంతిని బెన్‌క్రాప్ట్‌ భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి బ్యాట్‌ టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని థర్డ్‌మ్యాన్‌ దిశగా గాల్లోకి లేచింది.

ఈ క్రమంలో ఉసామా మీర్‌ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్‌ను పట్టిన అది ఫ్రీహిట్‌ అని మర్చిపోయిన ఉస్మామీర్‌ బంతిని త్రో చేయకుండా సంబరాల్లో మునిగితేలిపోయాడు. వెంటనే మరో సిడ్నీ ఆటగాడు బాల్‌ త్రో చేయమని సైగ చేస్తే.. అప్పుడు మీర్‌ వికెట్‌ కీపర్‌ వైపు త్రో చేశాడు. దీంతో ఆటగాళ్లు అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాకిస్తాన్‌ ఆటగాళ్లు అంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మీర్‌ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.


చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement