England Star All Rounder Ben Stokes Announces Retirement From ODI Cricket - Sakshi
Sakshi News home page

Ben Stokes: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అనూహ్య నిర్ణయం!

Published Mon, Jul 18 2022 5:43 PM | Last Updated on Mon, Jul 18 2022 6:38 PM

England Star All Rounder Ben Stokes Announces Retirement From ODI Cricket - Sakshi

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు భారీ కుదుపు! స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు. తాను వన్డే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్టు స్టోక్స్‌ సోమవారం ప్రకటించాడు. దక్షిణాప్రికాతో డర్హమ్‌లో మంగళవారం జరిగే వన్డే మ్యాచ్‌ తన చివరిదని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు. ఇప్పటివరకు 104 వన్డేలు ఆడిన స్టోక్స్‌ 2919 పరుగులు చేశాడు. వాటిలో 3 సెంచరీలు, 21 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

ఇటీవలే స్టోక్స్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. స్టార్ ప్లేయర్ జోరూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పగ్గాలు చేపట్టిన అతను.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించాడు. అతని సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు క్లీన్‌ స్వీప్‌ చేసింది. 9 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ ఈ ఘనత సాధించింది. కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ నియామకం కూడా ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement