IND Vs WI: Chahal One Wicket Short To 100 Wickets Milestone In ODIs - Sakshi
Sakshi News home page

Yuzvendra Chahal: అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్‌

Published Mon, Jan 31 2022 7:33 PM | Last Updated on Mon, Jan 31 2022 8:26 PM

IND Vs WI: Chahal One Wicket Short To 100 Wickets Milestone In ODIs - Sakshi

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలరాయిని చేరుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. విండీస్‌తో త్వరలో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్‌లో మరో వికెట్‌ సాధిస్తే ఈ ఫార్మాట్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకునే 23వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. 

ఈ జాబితాలో స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే 269 మ్యాచ్‌ల్లో 334 వన్డే వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్‌లో 59 మ్యాచ్‌లు ఆడిన 31 ఏళ్ల చహల్‌.. 5.19 సగటున 99 వికెట్లు తీశాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్ల ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ గణాంకాలు 6/42గా ఉన్నాయి. 

కాగా, ఇటీవలి కాలంలో మునుపటి ఫామ్‌ను ప్రదర్శించలేకపోతున్న చహల్‌.. జట్టులోని వస్తూ పోతూ ఉన్నాడు. తాజాగా ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో ఛాన్స్‌ లభించినప్పటికీ 3 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. అయినప్పటికీ విండీస్‌తో ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు చహల్‌ ఎంపికయ్యాడు. 
చదవండి: అందుకే ఐపీఎల్‌లో ఆడకూడదని డిసైడయ్యా.. ఆసీస్‌ బౌలర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement