
వన్డే క్రికెట్‌కు హాడిన్ వీడ్కోలు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ గెలిచిన అనంతరం 37 ఏళ్ల హాడిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 126 వన్డేలు ఆడిన తను 3,122 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. కీపర్‌గా 170 క్యాచ్‌లు అందుకోగా 11 స్టంపింగ్స్ చేశాడు. క్లార్క్ కూడా ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
బట్టలిప్పేసిన ఫాల్క్‌నర్: ఐదోసారి ప్రపంచకప్ గెలిచిన జోష్‌లో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు ఆదివారం రాత్రి ఫైనల్ ముగిశాక పార్టీలో రెచ్చిపోయారు. తెల్లవారుజాము వరకు జరిగిన ఈ సంబరంలో పేసర్ ఫాల్క్‌నర్ ఓ అడుగు ముందుకేసి నగ్నంగా చిందులేశాడట. ఈ విషయాన్ని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాడిన్ బయటపెట్టాడు.