వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను స్పోర్ట్స్ టుడే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్తాన్‌పై చేసిన అజేయ డబుల్ సెంచరీకి (201) టాప్ ప్లేస్ లభించింది. 1983 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్‌కు రెండో స్థానం దక్కింది.
1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ ఆడిన 143 పరుగుల ఇన్నింగ్స్ మూడో స్థానం..
1984లో ఇంగ్లండ్‌పై వివ్ రిచర్డ్స్ ఆడిన 189 పరుగుల ఇన్నింగ్స్‌కు నాలుగో స్థానం..
2003 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌పై రికీ పాంటింగ్ ఆడిన 140 పరుగుల ఇన్నింగ్స్‌కు ఐదో స్థానం..
1997లో భారత్‌పై సయీద్ అన్వర్ ఆడిన 194 పరుగుల ఇన్నింగ్స్‌కు ఆరో స్థానం..
2023 వరల్డ్‌కప్‌లో భారత్‌పై ట్రవిస్ హెడ్ ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్‌కు ఏడో స్థానం..
2012లో శ్రీలంకపై విరాట్ కోహ్లి ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్‌కు ఎనిమిదో స్థానం..
2011 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గౌతమ్ గంభీర్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్‌కు తొమ్మిదో స్థానం..
2014లో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల ఇన్నింగ్స్‌కు పదో స్థానం దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment