‘శత’క్కొట్టిన పృథ్వీ షా | Prithvi Shaw scores century as Mumbai beat Delhi in Vijay Hazare Trophy | Sakshi
Sakshi News home page

‘శత’క్కొట్టిన పృథ్వీ షా

Published Mon, Feb 22 2021 5:14 AM | Last Updated on Mon, Feb 22 2021 5:14 AM

Prithvi Shaw scores century as Mumbai beat Delhi in Vijay Hazare Trophy - Sakshi

జైపూర్‌: ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న ముంబై యువ ఓపెనర్‌ పృథ్వీషా (89 బంతుల్లో 105 నాటౌట్‌; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో టచ్‌లోకి వచ్చాడు. విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఢిల్లీ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హిమ్మత్‌ సింగ్‌ (145 బంతుల్లో 106 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత పోరాటం చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో వశిష్ట్‌ (70 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 31.5 ఓవర్లలోనే మూడు వికెట్లే కోల్పోయి 216 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ పృథ్వీ షా, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (39; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. తర్వాత పృథ్వీకి జతయిన సూర్యకుమార్‌ యాదవ్‌ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధసెంచరీ బాదాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో ముంబై విజయం సులువైంది.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
► బెంగాల్‌: 315/6 (కైఫ్‌ అహ్మద్‌ 75, అనుస్తుప్‌ 58); సర్వీసెస్‌: 245 (రజత్‌ 90, పుల్‌కిత్‌ 53; ఇషాన్‌ పొరెల్‌ 2/31).
► జమ్మూకశ్మీర్‌: 279/9 (శుభమ్‌ 68, వివ్రత్‌ శర్మ 66); సౌరాష్ట్ర: 283/7 (చిరాగ్‌ జానీ 93 నాటౌట్, అర్పిత్‌ 66).
► హరియాణా: 299/9 (హిమాన్షు రాణా 102, రాహుల్‌ తెవాటియా 73); చండీగఢ్‌: 300/7 (మనన్‌ వొహ్రా 117, అంకిత్‌ 78).  
► మహారాష్ట్ర: 295/8 (రుతురాజ్‌ గైక్వాడ్‌ 102; వైభవ్‌ అరోరా 4/45); హిమాచల్‌ ప్రదేశ్‌: 236 (అభిమన్యు రాణా 46, రాజ్‌వర్ధన్‌ 4/42).
► పుదుచ్చేరి: 273/6 (పారస్‌ డోగ్రా 101, ); రాజస్తాన్‌: 274/4 (మనేందర్‌ సింగ్‌ 115).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement