
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న సంగతి తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్‌తో ఫించ్ తన చివరి మ్యాచ్(146వ మ్యాచ్) ఆడనున్నాడు. టీ20లపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫించ్ మీడియాకు తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పనున్న ఫించ్‌పై టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లి ఫించ్‌తో ఉన్న అనుబంధాన్ని ఎమోషనల్‌గా పేర్కొన్నాడు.
''వెల్‌డన్ ఫించీ.. నీకు ప్రత్యర్థిగా ఇన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడడం ఎప్పటికి మరిచిపోనూ. అలాగే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఇద్దరం ఒకే జట్టుకు ఆడడం మంచి అనుభూతి కలిగించింది. ఆల్ ది బెస్ట్ ఫర్ టి20 క్రికెట్.. నీ తర్వాతి లైఫ్‌ను సాఫీగా సాగించు'' అంటూ కోహ్లి పేర్కొన్నాడు.
కాగా గత కొంత కాలంగా వన్డేల్లో ఫించ్ దారుణంగా విఫలమవుతున్నాడు. అతడు తన ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్ 2013 శ్రీలంకపై ఆసీస్ తరపున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 145 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన ఫించ్.. 5041 పరుగులు సాధించాడు. 54 వన్డేల్లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా ఫించ్ వ్యవహారించాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2015 వన్డే వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా నెగ్గడంలో ఫించ్‌ది కీలకపాత్ర. ఆ వరల్డ్‌కప్‌లో ఫించ్ 8 మ్యాచ్‌ల్లో 280 పరుగులు సాధించాడు.
ఇక 2021 టి20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఫించ్ నాయకత్వం వహించాడు. బ్యాటర్‌గా విఫలమైనప్పటికి కెప్టెన్‌గా మాత్రం ఫించ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. కాగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌లో ఫించ్ సారధ్యంలోనే ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలన నిర్ణయం.. వన్డేలకు గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment