50 ఓవర్ల ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని షిమోగలో జరిగిన అంతర్ జిల్లా అండర్-16 టోర్నీ ఓ అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. టోర్నీలో భాగంగా భద్రావతి-సాగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ యువ ఆటగాడు ఏకంగా క్వాడ్రాపుల్ సెంచరీ (నాలుగు వందల పరుగులు) బాదాడు. సాగర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తన్మయ్ మంజునాథ్ 165 బంతుల్లో.. 48 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 407 పరుగులు చేశాడు.
New #worldrecord set by 16 year old boy Tanmay Manjunath frm Sagar, Shivamogga. He scored 407 runs in 165 balls against Bhadravathi NTCC at #KSCA under 16, 50 overs inter district tournament. He had hit 48 boundaries & 24 Sixes. He was representing Sagar #Cricket club. 1/2 pic.twitter.com/BK12x3xXo1
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) November 12, 2022
ఫలితంగా సాగర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 583 పరుగులు చేసింది. అనంతరం అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భద్రావతి టీమ్ కేవలం 73 పరుగులకే కుప్పకూలి అత్యంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగిన తన్మయ్.. యాభై ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు.
అంతర్జాతీయ వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ హండ్రెడ్స్ తన ఖాతాలో వేసుకున్న హిట్‌మ్యాన్.. శ్రీలంకపై 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 264 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్‌గా కొనసాగుతుంది. లిస్ట్-ఏ క్రికెట్ కూడా కలుపుకుంటే సర్రే-గ్లామోర్గన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏడీ బ్రౌన్ 268 పరుగులు సాధించాడు.
చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు'
Comments
Please login to add a commentAdd a comment